Home / TELANGANA / కడియం శ్రీహరితో ఉపాధ్యాయ సంఘాల చర్చలు సఫలం..!!

కడియం శ్రీహరితో ఉపాధ్యాయ సంఘాల చర్చలు సఫలం..!!

ఉపాధ్యాయ సంఘాల 34 డిమాండ్లపై ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరితో జరిగిన చర్చలు సఫలం అయ్యాయి. పదో తరగతి స్పాట్ వాల్యుయేషన్ బహిష్కరణను వాయిదా వేసేందుకు ఉపాధ్యాయ సంఘాల నేతలు అంగీకరించారు. ఉపాధ్యాయ సంఘాలు, విద్యాశాఖ మధ్య ఈ రోజు జరిగిన అంశాలపై లెటర్ రాసుకుని ఇరు వర్గాలు సంతకం చేశాయి. మొత్తానికి శనివారం సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి 10.45 నిమిషాలకు వరకు జరిగిన సుదీర్ఘ చర్చలు సఫలమై.. ఏప్రిల్ రెండో తేదీ నుంచి జరిగే పదో తరగతి స్పాట్ వాల్యుయేషన్ కు ఉపాధ్యాయులు హాజరవుతారని హామీ ఇచ్చారు. సర్వోత్తమ్ రెడ్డి నాయకత్వంలోని జాయింట్ కౌన్సిల్ ఆఫ్ టీచర్స్ యూనియన్ , మణిపాల్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ఎంప్లాయిస్ జాక్ నేతలు శనివారం ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తో సచివాలయంలోని ఆయన చాంబర్ లో సమావేశమై 34 డిమాండ్ల పరిష్కారంపై చర్చించారు. ఈ చర్చల్లో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఉపాధ్యాయ సంఘాల నేతలకు మధ్య పలు అంశాలపై పరస్పర అంగీకారం కుదిరింది. ఉపాధ్యాయ సంఘాలు ఇచ్చిన 34 డిమాండ్లను అధ్యయనం చేసి పరిష్కరించేందుకు నెల రోజుల సమయం కావాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చేసిన విజ్ణప్తికి ఉపాధ్యాయ సంఘాలు అంగీకరించాయి. దీంతో మరో నెల రోజుల్లో ఈ డిమాండ్ల పరిష్కారంపై సమావేశం పెట్టడానికి డిప్యూటీ సిఎం కడియం హామీ ఇచ్చారు. ఈ సమావేశానికి న్యాయశాఖ, సాధారణ పరిపాలన శాఖ అధికారులను కూడా పిలుస్తానని చెప్పారు. పలు అంశాలపై టీఎన్జీవో నేతలు కూడా నెల రోజుల సమయం ఇచ్చి సమ్మె నోటీసు ఇచ్చారని, వీరిని సిఎం కేసిఆర్ పిలిచినప్పుడు ఉపాధ్యాయ సంఘాల నేతలను కూడా పిలిపించేందుకు తాను ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. దీనికి కూడా ఉపాధ్యాయ సంఘాల నేతలు ఒప్పుకున్నారు.

పదో తరగతి పరీక్షల స్పాట్ వాల్యుయేషన్ పారితోషకం పెంచేందుకు వెంటనే నిర్ణయం తీసుకుంటానని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఉపాధ్యాయ సంఘాలకు హామీ ఇచ్చారు. దీనికి సంబంధించి వివిధ స్లాబ్ లతో పారితోషకాన్ని నిర్ణయించే నివేదికను తయారు చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.

ఉపాధ్యాయుల అనేక సమస్యలకు ఏకైక పరిష్కారంగా ఉన్న ఏకీకృత సర్వీస్ రూల్స్ కోర్టుల్లో కొనసాగుతున్నాయని, వీటి పరిష్కారం వేగవంతం చేసేందుకు ప్రత్యేకంగా ఒక అడ్వకేట్ ను పెట్టుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని కోరడంతో ఆయన దానికి అంగీకరించారు. వారం రోజుల్లో అడ్వకేట్ ను పెట్టుకునేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఉపాధ్యాయులకు ఉచిత ఆరోగ్యచికిత్స అందించే వెల్ నెస్ సెంటర్లను ప్రతి జిల్లాలో ఏర్పాటు చేసే విధంగా విద్యాశాఖ తరపు నుంచి ముఖ్యమంత్రిని కోరుతానని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఉపాధ్యాయ సంఘాల నేతలకు తెలిపారు.

సిపిఎస్ రద్దు అనేది విధానపర నిర్ణయమని, ఇలాంటి మిగిలిన అనేక సమస్యలు ముఖ్యమంత్రి కేసిఆర్ పరిధిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపారు. తన పరిధిలో ఉండి, ఇంకా పరిష్కారం కాని సమస్యలు ఏవైనా ఉంటే తన దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తానని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఉపాధ్యాయ సంఘాలకు హామీ ఇచ్చారు. చిన్ని, చిన్న అంశాలపై ఎప్పుడైనా తనతో చర్చించవచ్చని, ఈ 34 అంశాలపై మరో నెల రోజుల్లో సమావేశం అవుదామని తెలిపారు.

ఉపాధ్యాయులు, విద్యాశాఖకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో భాగంగా విద్యార్థులను ఇబ్బంది పెట్టవద్దని, వారిని, వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేసే విధంగా పరీక్షలు, వాటి మూల్యంకనను బహిష్కరించే పద్దతి మంచిది కాదన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat