తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో పలుచోట్ల ఆకస్మికంగా వర్షం కురిసింది . నిండు వేసవిలోనూ ఆకాశం మేఘావృతమై ఉండటంతో ఉదయం నుంచి నగరంలో వాతావరణం భిన్నంగా కనిపించింది. దీనికితోడు పలుచోట్ల వర్షం కురియడంతో వాతావరణం చల్లగా మారిపోయింది. హయత్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్ వర్షం పడగా.. సికింద్రాబాద్, మౌలాలీలో వడగండ్ల వాన ముంచెత్తింది. మల్కాజ్‌గిరి, సైనిక్‌పురిలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది.
