తిరిగి సొంత గూటికి మంత్రి అఖిలప్రియ.. కన్ఫాం చేసిన ఫోన్ కాల్..!! అవును, ప్రస్తుత ఏపీ పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిల ప్రియ తాను రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన పార్టీ వైసీపీలోకి తిరిగి రానున్నారు. ఈ వార్తను ఇప్పుడు అటు టీడీపీ వర్గాలతోపాటు ఇటు వైసీపీ వర్గాలు కన్ఫాం చేశాయి. అయితే, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై పలు సందర్భాల్లో మంత్రి అఖిల ప్రియ తన అభిమానాన్ని చాటుకున్న విషయం తెలిసిందే. వైఎస్ జగన్‌ను నేను అన్నా అని పిలుస్తానని, జగన్ అన్నను నేను కోపంతో ఏమన్నా అన్నానంటే అది కేవలం సీఎం చంద్రబాబు గురించి అనాల్సి వచ్చిందే తప్ప, ఆ మాటలు నా మనసులో నుంచి వచ్చినవి కావని, నాడు మా అమ్మ(శోభానాగిరెడ్డి మృతి చెందిన సమయంలో జగన్ అన్న ఓదార్చిన విధానం, నేనున్నానంటూ చెప్పిన మాటలు జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేనంటూ, అమ్మ మరణం తరువాత వైసీపీ ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన నన్ను వైఎస్ జగన్ అన్న రాజకీయంగా ప్రోత్సహించారు. తండ్రి (భూమా నాగిరెడ్డి) తరువాత తండ్రిలా జగన్ అన్న నన్ను ఆదరించారు అంటూ తన స్నేహితుల వద్ద చెప్తుంటారు అఖిలప్రియ.
see also :
విరాట్ కోహ్లీకి ఇన్‌స్టాగ్రామ్ అవార్డు..!!
అయితే, ప్రస్తుతం టీడీపీలో మంత్రిగా కొనసాగుతున్న మంత్రి అఖిల ప్రియకు ఆ పార్టీ నేతల నుంచే భయం పట్టుకుంది. అందుకు కారణాలు లేకపోలేదు మరీ..!! గత సంవత్సరం నవంబర్‌లో నెలలో కృష్ణా జిల్లాల జరిగిన పడవ ప్రమాదంలో 22 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయతే, ఆ ఘటనకు సంబంధించి మంత్రి అఖిలప్రియను బాధ్యురాలిని చేస్తూ చంద్రబాబు ఫైరయ్యారు. అదే సమయంలో మంత్రి అఖిల ప్రియ చంద్రబాబు తీరుపై తన బంధుగణం వద్ద వాపోయిందని, తండ్రి (భూమానాగిరెడ్డి) ఉన్నప్పుడు తనను పల్లెత్తు మాట కూడా అనేవారు కాదని, తండ్రి మరణం తరువాత నన్నే టార్గెట్ చేస్తూ టీడీపీ నేతలు మాట్లాడుతుండటం బాధ కలిగిస్తుందంటూ అఖిల ప్రియ మాటలు మీడియాలో వచ్చిన విషయం తెలిసిందే. మరోపక్క సొంత నియోజకవర్గంలోనే టీడీపీ నేతగా ఉంటున్న ఏవీ సుబ్బారెడ్డి సైతం అఖిలప్రియపై రాజకీయ బాణాలు దూస్తున్నారు. అంతేకాకుండా, నాకొక్క అవకావం ఇస్తే అఖిలప్రియపై పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుస్తా, అందుకు తగ్గ ఓట్లు సంపాదించగలనని సీఎం చంద్రబాబు వద్ద ఏవీ సుబ్బారెడ్డి చెప్పినట్టు సమాచారం.
see also :
సీబీఐ విచారణలో పచ్చి నిజాలు వెలుగులోకి..!!
ఇదిలా ఉండగా, ప్రజల సమస్యలపై పోరాడుతూ, ప్రజా సంకల్ప యాత్రతో ప్రత్యేక హోదా వాదాన్ని ప్రజల్లోకి మరింత బలంతా తీసుకెళ్తున్న వైఎస్ జగన్‌ను మంత్రి అఖిల ప్రియ ఫోన్‌లో సంప్రదించారట. ఆ ఫోన్ సంభాషణకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
అఖిల ప్రియ : అన్నా..
జగన్ : ఏం అక్కా ఇప్పటికి గుర్తొచ్చామా..? (గాంభీర్యంగా)
అఖిల ప్రియ : ఎలా ఉన్నావు అన్నా..? (తన స్వరాన్ని తగ్గిస్తూ..)
అఖిలప్రియ : ప్రజా సంకల్ప యాత్ర ఎలా జరుగుతోంది అన్నా..?? (ఎంతో గౌరవంతో)
అఖిలప్రియ : అన్నా..!! ( కన్నీటితో కర్నూలు రాజకీయాలపై మాట్లాడింది)
అఖిల ప్రియ : నేను టీడీపీలో ఉంటున్నా, టీడీపీ పార్టీ నేతలే నాపై కుట్ర పన్నుతున్నారన్నా, నన్ను రాజకీయంగా దెబ్బ తీయడానికి టీడీపీ నేతలు ప్రయత్నాలను ముమ్మరం చేశారన్నా అంటూ జగన్ చెప్తూ కన్నీరు మున్నీరైంది అఖిలప్రియ. నన్ను రాజకీయంగానే కాకుండా ఏం చేస్తారో..!! అంటూ తన బాధనంతా జగన్‌తో చెప్పుకుంది.
జగన్ : ఒక్క కర్నూల్లోనే కాదు, ఏపీలో, దేశంలో ఏ క్షణం, ఏం జరుగుతుందో నాకు తెలుసు..!
కాస్త సమయం తరువాత..
జగన్ : నేనున్నంత కాలం నిన్నెవరూ ఏం చేయలేరు.. మన పార్టీలోకి వచ్చేస్తావా..?
అఖిలప్రియ : ఆ.. వస్తానన్నా..!!
జగన్ : ప్రజా సంకల్ప యాత్ర పూర్తి కాగానే, విషయాలన్నీ నేనే చూసుకుంటాను, నువ్వే బాధపడకు అంటూ ఫోన్ పెట్టేశారు..
టీడీపీ మంత్రి అఖిల ప్రియ, వైసీపీ అధినేత జగన్ మధ్య జరిగిన ఈ సంభాషనే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఏదేమైనా త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల్లోపూ ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతాయని అంచనా వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.