ఏపీలో మరోసారి అధికార పార్టి నేతలు దారుణ హత్యకు పాల్పడ్డారని ప్రతిపక్ష నేతలు వైసీపీ నాయకులు అంటేన్నారు. అనంతపురం జిల్లాలో టీడీపీ నేతలు మరోసారి రెచ్చిపోయి కందుకూరు గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త శివారెడ్డిని దారుణంగా చంపారు. ఇటుకలపల్లి నుంచి కందుకూరుకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న శివారెడ్డిని టీడీపీ కార్యకర్తలు కాపుకాసి వేటకొడవళ్లతో నరికిచంపారు. పీర్ల పండగ సందర్భంగా కందుకూరులో ఇటీవల ఓ గొడవ జరిగింది. ఆ ఘటనను ఆసరాగా చేసుకొని టీడీపీ కార్యకర్తలు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని భావిస్తున్నారు. కాగా మంత్రి పరిటాల సునీత ప్రోద్బలంతోనే టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోతున్నారని వైసీపీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. శివారెడ్డి హత్య వెనుక పోలీసుల వైఫల్యం ఉందని అన్నారు. టీడీపీ నేతల నుంచి ప్రాణహాని ఉందని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా సీఐ రాజేంద్రనాథ్ పట్టించుకోలేదని తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
