ఏపీ మంత్రి పరిటాల సునీత ఇంట మళ్లీ పెళ్లి బాజాలు మోగనున్నాయి. పరిటాల రవి-సునిత తనయుడు పరిటాల శ్రీరామ్ జరిగిన ఆరునెలలకు వారి ఇంట్లో మళ్లీ వివాహ సందడి మొదలైంది. పరిటాల దంపతుల కుమార్తె స్నేహలత నిశ్చితార్థం ఆమె మేనబావ హర్ష వడ్లమూడి మార్చి 29న జరిగింది. పరిటాల రవి సోదరి అయిన శైలజ కుమారుడు హర్ష.
పరిటాల కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం శైలజ కుమారుడితో తన కూతురు వివాహం జరగాలని పరిటాల రవి ఆకాంక్షించారు. దివంగత రవి ఆకాంక్ష మేరకు తాజాగా అనంతపురం జిల్లాలోని వెంకటాపురంలో జరిగింది. వీరి వివాహం మే 6. స్నేహలత మెడిసిన్ చేస్తున్నారు. మెడిసిన్ పూర్తయిన తర్వాత పేదలు, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయాలనేది స్నేహలత ఆకాంక్షగా తెలుస్తోంది. పరిటాల కుటుంబం ఓ ఆస్పత్రిని నిర్మించనుందని, దాని బాధ్యతలను స్నేహలత చూసుకోనుందని సమాచారం. హర్ష వ్యాపారవేత్తగా ఉన్నారు.