Home / TELANGANA / ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెలకు ఉచితంగా దాణా పంపిణీ..

ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెలకు ఉచితంగా దాణా పంపిణీ..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెలకు వేసవిని దృష్టిలో ఉంచుకొని 66 కోట్ల రూపాయలతో ఉచితంగా దాణా పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక శాఖామంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.ఇవాళ సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇప్పటివరకు 2 లక్షల 53 వేల 785 మందికి, 53 లక్షల పైచిలుకు గొర్రెలను పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. కేవలం గొర్రెలను పంపిణీ చేయడమే కాకుండా వాటి దాణా, నీరు, ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని మంత్రి తెలిపారు.యూనిట్ కు 4 బస్తాల దాణాను అందించడం జరుగుతుందన్నారు.

గొర్రెలకు భీమా సౌకర్యం కూడా కల్పించడం జరిగిందని, చనిపోయిన వాటి వివరాలను వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేస్తే క్లేయిమ్స్ చెల్లిస్తొందని మంత్రి తెలిపారు. గొర్రెల పెంపకం దారు ప్రమాదవశాత్తు చనిపోయినట్లయితే 6 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ఇవ్వటం జరుగుతుందని ఆయన తెలిపారు. రాబోయే రోజులలో మన రాష్ట్రం మాంసం ఎగుమతి చేసే స్ధాయికి చేరుతుందన్నారు. రంగారెడ్డి జిల్లా మామిడి పల్లిలో ఆధునిక సౌకర్యాలతో గొర్రెల పెంపకంపై శిక్షణా కేెంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.

వేసవిని దృష్టిలో ఉంచుకొని ఎక్కువ కోతలు ఇచ్చే మేలు రకపు పశు గ్రాస విత్తనాలను 75 శాతం రాయితీ పై రైతులకు ఇవ్వటం జరుగుతుందన్నారు.పశువుల ఆరోగ్యానికి సంబంధించి 1962 కాల్ సెంటర్ ద్వారా వెటర్నరీ సేవలనందిస్తున్నామని, మొత్తం100 సంచార పశు వైద్యశాలలు పనిచేస్తున్నాయని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన గొర్రెల ద్వారా ప్రస్తుతం రాష్ట్రంలో గొల్లకురుమలు సంతోషంగా ఉన్నారని అన్నారు. రాష్ట్రంలోని సంచార పశువైద్యశాలలు సత్పలితాలను ఇస్తున్నాయని ఆయన తెలిపారు. జిల్లా కలెక్టర్లు, పశుసంవర్ధక శాఖ అధికారులు సమిష్టి కృషితో గొర్రెల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా సాగుతుందని అన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat