టీజేఏసీ ఛైర్మన్ ప్రొ. కోదండరాం పార్టీ పేరు ఏంటనే దాని మీద ఇంత వరకు అనేక అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఇంక అవన్నీ త్వరలోనే పటాపంచలు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.కోదండరాం నేతృత్వంలోని ఈ పార్టీకి ‘ తెలంగాణ జన సమితి ‘ అనే పేరుతో ఈసీకి దరఖాస్తు చేసుకున్నారట. ఎన్నికల సంఘం కూడా ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. ఇక కోదండరాం పార్టీ గురించి అధికారికంగా ప్రకటించడమే మిగిలింది. ఏప్రిల్ 29న పార్టీ పేరును, పార్టీ జెండా, ఎజెండాలను ప్రకటిస్తారట. బహిరంగ సభ ఏర్పాటుచేసి ప్రకటించనున్నారు. ఇందుకోసం ఎల్బీ స్టేడియం, ఎన్టీఆర్ స్టేడియం, పరేడ్ గ్రౌండ్స్‌ను పరిశీలిస్తున్నారు. ఈ మూడింటిలో ఎక్కడోచోట సభ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకోసం ఇప్పటికే కోదండరాం పోలీసుల అనుమతి కోరారు.
