తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఇవాళ సిద్ధిపేట జిల్లలో పర్యటిస్తున్నారు.పర్యటనలో భాగంగా సిద్దిపేట స్టేడియాంలో రూ.1.80కోట్లతో ఏర్పాటు చేయనున్న ప్లడ్ లైట్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.రేపు ఏప్రిల్ ఫస్ట్ నాడు అందరూ ఏప్రిల్ పూల్ గా పరిగణించి అందరూ ఏప్రిల్ ఫుల్ అంటారు.. కానీ మంత్రి హరీష్ రావు గారు ” ఏప్రిల్ ఫుల్ కాదు.ఏప్రిల్ కూల్ ” అని ఈ సందర్భంగా మంత్రి పిలుపునిచ్చారు.ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటి ఏప్రిల్ లో వేడిమినీ తగ్గించి ఏప్రిల్ కుల్ చేద్దాం అన్నారు.ప్రతి ఒక్కరు తమ పుట్టిన రోజున…ఇష్టమైన వారి పేరు పై ఒక మొక్క నాటాలి అని ఈ సందర్భంగా హరీష్ రావు కోరారు. సిద్ధిపేట ను ఆకుపచ్చని అభివృద్ధి సిద్దిపేట గా మారుద్దాం అని చెప్పారు.ఈ క్రమంలో ఇటీవల తమ పిల్లల పుట్టిన రోజు మొక్కలు నాటించి ఆదర్శంగా నిలిచిన కౌన్సిలర్ లను మంత్రి అభినందించారు.
అంతకముందు ఇవాళ హనుమాన్ విజయోత్సవం సందర్భంగా సిద్దిపేట రంగదాంపల్లి హనుమాన్ దేవాలయం నుండి సిద్దిపేట పట్టణ నలుమూలల శోభాయాత్ర ( ర్యాలీ ) నిర్వహించనున్నారు….ఈ సందర్భంగా రంగదాంపల్లి వద్ద జెండా ఊపి శోభాయాత్ర ను మంత్రి హరీష్ రావు ప్రారంబించారు.