దటీజ్ జగన్. వైఎస్ఆర్ సీపీ అభిమానులు కాలర్ వేసుకునే వార్త. అవును, ఇది, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ అభిమానులు, వైసీపీ కార్యకర్తలు కాలర్ ఎగరేసుకునే వార్తే అవుతుంది. అందుకు కారణం జాతీయ స్థాయిలో సర్కులేషన్ ఉన్న ఓ ఆంగ్ల పత్రిక చేసిన సర్వేనే. అయితే, ఇంతకీ ఆ ఆంగ్ల పత్రిక ఏం చెబుతోంది..? వైసీపీ అభిమానులు ఎందుకు కాలర్ ఎగరేసుకునేలా ఉన్న ఆ వార్త ఏమిటి..? అన్న విషయాలను ఓ సారి పరిశీలిస్తే..!!
జాతీయ స్థాయిలో బాగా సర్క్యులేషన్ ఉన్న ఆంగ్లపత్రికల్లో ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఒకటి. అయితే, ఆ పత్రిక ఇటీవల ఓ సర్వే నిర్వహించింది. అదేమిటంటే. భారత్‌లో అత్యంత శక్తివంతులైన, ప్రభావితం చేయగల వంద మంది వ్యక్తులు ఎవరన్న అంశంపై సర్వే చేసింది. అయితే, ఆ సర్వేలో అందరూ అనుకున్నట్టే దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రథమ స్థానాన్ని దక్కించుకున్నారు. ఆ తరువాతి స్థానంలో అమిత్ షా ఉన్నారు. సోనియా గాంధీ 5, మమతా బెనర్జీ 6, ముకేష్ అంబాని 10, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ 11వ స్థానంలో నిలిచారు.
ఇక ఆంధ్రప్రదేశ్‌లో ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఆంగ్ల పత్రిక చేసిన సర్వేలో ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత
వైఎస్ జగన్ మొదటిది స్థానంలో నిలిచారు. జాతీయ స్థాయిలో వైఎస్ జగన్ 35వ స్థానంలో ఉండగా, ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం 36వ స్థానంతో సరిపెట్టుకున్నారు. అంతేకాకుండా, ఆ సర్వే వైఎస్ జగన్ ప్రభావితం చేయగల స్థానాన్ని మెరుగు పరుచుకోవడానికి గల కారణాలను వెల్లడించింది.
ఆ విషయాలను ఒకసారి పరిశీలిస్తే.. జగన్ మాట ఇస్తే తప్పడని, ఆ విషయం పలు సందర్భాల్లో రుజువైందని పేర్కొంది ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్. రాష్ట్ర విభజన, ప్రత్యేక హోదా, అలాగే ఇతర పార్టీల నుంచి వచ్చే వారిని రాజీనామాలు చేసి వైసీపీలో చేరమనడం వంటి అంశాలు వైఎస్ జగన్‌ను అత్యంత శక్తివంతమైన వ్యక్తుల్లో నిలబడేలా చేశాయన్నారు. వైఎస్ జగన్ తన స్టాండ్‌ను ఇలాగే కొనసాగిస్తూ త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కావడం ఖాయమంటూ పేర్కొంది ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సర్వే. అయితే, చంద్రబాబు గురించి ప్రస్థావించిన ఆంగ్ల పత్రిక పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. చంద్రబాబు హయాంలో ఒక వర్గానికే ప్రాధాన్యత పెరిగిందని, 2019 ఎన్నికల్లో ముస్లిం, మైనార్టీ, అలాగే కాపుల ఓట్లను చంద్రబాబు కోల్పోనున్నారని స్పష్టం చేసింది. ఏదేమైనా ఆంగ్లపత్రిక చేసిన ఈ సర్వేలో జగన్ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబుకంటే ముందంజలో ఉండటంతో వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తుండగా.. టీడీపీ శ్రేణులు మాత్రం మీడియాకు ముఖం చాటేస్తున్నారని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.