వైఎస్ జగన్ ఓ దొంగ, కాదు.. కాదు.. ఓ పెద్ద గజ దొంగ, అది కూడా కాదు.. గజదొంగలలకే జగన్ ఓ బ్రాండ్ అంబాసిడర్ అంటూ ఏపీ జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమ సంచలన అన్నారు. కాగా, శుక్రవారం మంత్రి దేనేని ఉమ మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా సాధన విషయంలో వైఎస్ జగన్ డబుల్ గేమ్ ఆడుతున్నారని, ఏపీలో ప్రధాని మోడీని తిడుతూ.. ఢిల్లీలో ప్రధాని మోడీని పొగుడుతూ ప్రజలను మభ్యపెట్టేందుకు వైసీపీ యత్నిస్తోందన్నారు.
see also : టీడీపీకి బిగ్ షాక్ : వైసీపీలోకి కమ్మ సామాజిక వర్గ నేత..!!
సీబీఐ నమోదు చేసిన 13 కేసుల్లో ఏ1 ముద్దాయిగా ఉన్న వైఎస్ జగన్ చంద్రబాబును విమర్శించే అర్హత లేదన్నారు. గత కాంగ్రెస్ పాలకులు ఆంధ్రప్రదేశ్‌ను అన్ని విధాలా దోచుకున్నారని, కానీ, చంద్రబాబు నాయుడు అదికారం చేపట్టాక ఏపీ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని చెప్పారు మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు. ప్రాజెక్టుల్లో అవినీతి జరగడానికి ఇది మీ తండ్రి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి హయాం కాదు.. చంద్రబాబు నాయుడు హయాం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా ఏపీలో అవినీతికి చోటులేదని పేర్కొన్నారు.