వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులతోపాటు, దేశ రాజకీయ నాయకుల నోళ్లలో నానుతున్న పేరు ఇది. వైస్ఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి ప్రస్తుత రాజకీయ పరిణామాల దృష్ట్యా ప్రజలకు మరింత దగ్గరైన వ్యక్తుల్లో ఒకరంటూ రాజకీయ విశ్లేషకులు సైతం పేర్కొంటున్నారు. అయితే, వైఎస్ జగన్ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ఏ రాజకీయ నాయకుడు చేయని సాహసం చేశారనేది వారి అభిప్రాయం. ఇంతలా రాజకీయ విశ్లేషకులు జగన్ గురించి చెప్పడానికి కారణాలు లేకపోలేదు. అందుకు కారణం, ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో నిలిచిపోయేలా వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రే. వైఎస్ జగన్ తాను చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రతో నిత్యం ప్రజలతో మమేకమవుతున్నారు. ప్రతీ ఒక్కరిని పలుకరిస్తూ, సమస్యల పరిష్కారానికి మార్గాలను అన్వేషిస్తున్నారు వైఎస్ జగన్. దీంతో వైఎస్ జగన్‌కు ప్రజల్లో మరింత ఆదరణ పెరుగుతోందని, 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం ఖాయమనే సంకేతాలను ఇస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.
see also : నేను రాజకీయ సన్యాసం చేస్తా ..నీకు దమ్ముందా -జగన్ కు శ్రీధర్ సవాలు ..
ఈ నేపథ్యంలో విజయవాడలో తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగలనుందా..? త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల్లో కమ్మ ఓట్లన్నీ వైసీపీకే పడనున్నాయా..? ఇప్పటి వరకు ఓ స్థాయిలో ఉన్న వైసీపీలోకి ఇకనుంచి పుంజుకోనున్నాయా..? అంటే అవుననే సమాధానం ఇస్తున్న రాజకీయ విశ్లేషకులు. అయితే, రాజకీయ విశ్లేషకుల అభిప్రాయాలకు కారణాలు లేకపోలేదు మరీ. ఓ సారి ఆ అంశాలను పరిశీలిస్తే.. ఇటీవల కాలంలో ప్రజా సంకల్ప యాత్రతో, అంతేకాకుండా, ప్రత్యేక హోదాపై నిత్యం పోరాడుతూ, కేంద్ర ప్రభుత్వాన్ని సైతం లెక్క చేయక గళమెత్తుతున్న వైఎస్ జగన్‌కు ప్రజల్లో మరింత ఆదరణ పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ నెల 27వ తేదీ వైఎస్ జగన్ సమక్షంలో సత్తెనపల్లి నియోజకవర్గం టీడీపీ ఇన్‌ఛార్జ్ నిమ్మకాయల ఆదినారాయణ, మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఆతుకూరి నాగేశ్వరరావు, అంతకు ముందు, జ్యోతుల చంటిబాబు వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.
see also : వాట్సాప్ లో మరో అదిరిపోయో ఫీచర్..!
అయితే, తాజాగా వారి బాటలోనే మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత యలమంచిలి రవి వైసీపీలో సిద్ధమయ్యారు. అందుకు ముహూర్తాన్ని కూడా ఖరారు చేసుకున్నారు. తాజా సమాచారం మేరకు ఏప్రిల్ 10వ తేదీన కృష్ణా జిల్లాలోని విజయవాడలో వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో గతంలో పీఆర్పీ తరుపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన, అలాగే, కమ్మ సామాజికవర్గ నేతగా ఉన్న యలమంచిలి రవి ఇప్పుడు వైసీపీలో చేరుతుండటం టీడీపీకి గట్టిదెబ్బేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు.