ప్రిన్స్ మహేష్ బాబు ముఖ్యమంత్రి పాత్రగా నటిస్తున్న చిత్రం భరత్ అనే నేను.ఈ సినిమా ఏప్రిల్ 20న పెద్ద ఎత్తున విడుదల కానుంది. కైరా అద్వానీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో శరత్ కుమార్ , ప్రకాష్ రాజ్, దేవరాజ్, పోసాని కృష్ణమురళి ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు.అయితే ఈ సినిమాకు సంబంధించి కొన్ని ఫోటోలను చిత్ర యునిత్ ఇదివరకే విడుదల చేయగా..తాజాగా ఇవాళ మరో ఫోటోను విడుదల చేసింది. ఫస్ట్ టైం హీరోయిన్ తో కలిసి ఉన్న పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది . ఇది చాలా డిఫరెంట్ గా ఉంది.ఈ పోస్టర్ చూస్తుంటే.. హీరో మహేష్ బాబు సీఎం అయిన తర్వాత తన లవర్ తో రోడ్డుపై నడుస్తున్నట్లు ఉంది. ఆ వెనకే సీఎం సెక్యూరిటీ వెహికల్స్ వస్తూ ఉంటాయి. వీళ్లద్దరూ నడుస్తూ ఉండటంతో చుట్టూ పోలీసుల పహారా ఉంటుంది.అయితే చిత్ర యూనిట్ విడుదల చేసిన ఈ ఫోటో కు మహేష్ ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.
