వరుస హిట్ చిత్రాలతో తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు ప్రముఖ దర్శకులు కొరటాల శివ. అయితే, కొరటాల శివ తీసింది మూడు చిత్రాలే అయినా, అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఉన్నాయి. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ వంటి చిత్రాలు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కి టాప్ 3లో నిలవడం విశేషం. అయితే, మరోసారి తెలుగు సినీ ఇండస్ర్టీ రికార్డులను తిరగరాసేందుకు సిద్ధమయ్యాడు. అందుకు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌బాబును తన హీరోగా ఎంచుకుని, భరత్ అనే నేను చిత్రాన్ని శరవేగంగా పూర్తి చేసే పనిలో పడ్డాడు కొరటాల శివ. ఆ చిత్రానికి సంబంధించిన టీజర్ ఇటీవల విడుదలై యూట్యూబ్ ట్రెడింగ్‌లో టాప్‌లో ఉంది. దీంతో మహేష్ బాబు అభిమానులు ఆనందానికి అవధులు లేవు.
ఇదిలా ఉండగా, భరత్ అనే నేను చిత్రానికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కే ఈ చిత్రం వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ జీవిత చరిత్రేనని, అంతేకాకుండా, జగన్ నిర్వహించే ప్రతీ సభలోనూ పలికే మాటలు ఈ సినిమాలో దర్శకుడు కొరటాల శివ మహేష్ బాబుతో పలికించారని ఇండస్ర్టీ టాక్.మాట తప్పను, మడమ తిప్పను అని ఎవరైనా అంటే వెంటనే గుర్తొచ్చే పేరు వైఎస్ జగన్. ఎందుకంటే వైఎస్ జగన్ నిర్వహించే ప్రతీ సభలోనూ చెప్పే మాట ఇదే. అంతేకాకుండా, మా అమ్మ ఒక మాట చెప్పింది, ఎవరికైనా మాట ఇస్తే తప్పకూడదు అని మహేష్ బాబు పలికిన డైలాగ్ కూడా జగన్‌నే గుర్తుకు తెస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పాటనలో ప్రజలు ఎంతో సుఖ సంతోషాలతో ఉన్న విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని జగన్ అవకాశం వచ్చినప్పుడల్లా చెపుతారు. అంతేకాకుండా జగన్ తన వైసీపీ మేనిఫెస్టోలో కూడా వైఎస్ఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలతోపాటు మరికొన్ని పథకాలను చేర్చిన విషయం విధితమే. భరత్ అనే నేను చిత్రానికి సంబంధించిన ప్రతీ అంశం కూడా జగన్ జీవిత చరిత్రకు దగ్గరగా ఉండటంతో అటు మహేష్ అభిమానులతోపాటు, ఇటు జగన్ అభిమానులు ఫుల్ హ్యాప్పీలో ఉన్నారు.