కారణాలేమైనా పలువురు సినీ తారలు, టీవీ నటులు ఈ మధ్య కాలంలో వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ సందర్భాలు చూసాం. తాజాగా మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. తమిళనాడులో పర్యాటకులు అత్యధికంగా సంచరించే కన్యాకుమారి జిల్లా కులశేఖర ప్రాంతంలోని లాడ్జీల్లో వ్యభిచారం జరుగుతోందన్న సమాచారంతో తనిఖీలకు వెళ్లిన పోలీసులకు తమిళ సినీ పరిశ్రమకు చెందిన ఓ నటి పట్టుబడింది. తమిళనాడుతో పాటు కర్ణాటక, ఏపీ, కేరళ ప్రాంతాల నుంచి పర్యాటకులు వచ్చి వెళ్లే ఈ ప్రాంతానికి ఓ మహిళ, మరో ముగ్గురు యువతులతో వచ్చి అనుమానాస్పదంగా తిరుగుతుంటే, స్థానికులకు వారు వ్యభిచారం నిమిత్తమే వచ్చారన్న అనుమానం కలిగింది. దీంతో వారిపై కన్నేయగా, ఓ యువతిని లాడ్జిలో దింపి వచ్చిన మహిళ, మిగిలిన ఇద్దరితో ఓ చెట్టుకింద కూర్చుంది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా, దాడి చేసిన పోలీసులకు కోలీవుడ్ చిత్రాల్లో సహాయ నటిగా చేస్తున్న 18 సంవత్సరాల యువతి పట్టుబడింది. ఈలోగా బయట ఉన్న ముగ్గురూ తప్పించుకోగా, తనతో పాటు ఇద్దరు అమ్మాయిలు కూడా చెన్నై నుంచి వచ్చామని ఆమె వాగ్మూలం ఇచ్చినట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు హోటల్ యజమానిని అరెస్ట్ చేసి, పారిపోయిన వారి కోసం గాలిస్తున్నారు.