ప్రముఖ మొబైల్ మెసేజింగ్ యాప్.. వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్ ని ప్రవేశపెట్టింది. ఇప్పటికే పలు ఫీచర్లను పరిచయం చేయగా.. తాజాగా మరో ఫీచర్ ని వినియోగదారుల ముందుకు తీసుకువచ్చింది. ఇంతకీ ఆ ఫీచర్ ఎంటో తెలుసా..? ఇంకెందుకు ఆలస్యం చదివేయండి. ఈ ఫీచర్‌తో యూజర్లు తమ వాట్సాప్ నెంబర్లను తేలికగా మార్చుకోవచ్చు. అంతేకాక ఎలాంటి గందరగోళం లేకుండా కొత్త నెంబర్‌కు డేటాను కూడా బదిలీ చేసుకోవచ్చు. కొత్త ‘ఛేంజ్ నెంబర్’ ఫీచర్ అప్డేట్ ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్‌లోని 2.18.97 ఆండ్రాయిడ్ బీటా అప్డేట్కు అందుబాటులో ఉంది. అనంతరం ఈ ఫీచర్ ఐఓఎస్, విండోస్ డివైజ్లకి కూడా అందుబాటులోకి రానుంది.
కొత్త ‘ఛేంజ్ నెంబర్’ ఫీచర్‌తో ఓల్డ్ ఛేంజ్ నెంబర్ ఫీచర్‌కు మరిన్ని మెరుగులను అందించిందని డబ్ల్యూఏబీటాఇన్ఫో ట్వీట్ చేసింది. ఈ ఫీచర్‌తో అన్ని లేదా కొన్ని కాంటాక్ట్‌లను నోటిఫై చేయాలనుకుంటే, యూజర్లు ఆ స్పెషిఫిక్ కాంటాక్ట్‌లను ఎంపిక చేసుకోవచ్చని పేర్కొంది. ఛాట్ హిస్టరీని కొత్త ఛాట్‌లోకి మార్చుకోవచ్చని, డూప్లికేట్ ఛాట్లను డిలీట్ చేసుకోవచ్చని రిపోర్టు చేసింది. దీనికోసం యూజర్లు వాట్సాప్ సెట్టింగ్స్‌లోని అకౌంట్లో ఈ ‘ఛేంజ్ నెంబర్’అనే అనే ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఈ ఆప్షన్లో పాత, కొత్త ఫోన్ నెంబర్లను ఇన్సర్ట్ చేశాక, మీ కొత్త నెంబర్‌కు ఏ కాంటాక్ట్‌లను నోటిఫై చేయాలో వాట్సాప్ కోరుతోంది. కొత్త నెంబర్లోకి మారిన తర్వాత, పాత ఛాట్‌లో ఉన్న షేర్డ్ మెసేజ్‌లు, కొత్త దానిలోకి మరలుతాయని డబ్ల్యూబీటాఇన్ఫో పేర్కొంది.