అక్రమ సంబంధాలతో పవిత్రమైన స్త్రీలను ,సొంతవాళ్లను మోసం చేస్తున్నారు.. ఇలా చేస్తూ సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని చేస్తున్నారో అర్థం కావడం లేదు. తాజాగ తెలంగాణ లోని గ్రేటర్ వరంగల్ నగర పరిధిలోని 55వ, డివిజన్ భీమారంలో అసిస్టెంట్ ప్రోఫెసర్ ప్రవీణ్ రెడ్డి ఆయన మరదలు రక్షణారెడ్డి అక్రమ సంబంధం కారణంగా , ఆత్మహత్య చేసుకొన్నారు. ఈ ఘటన వరంగల్ నగరంలో కలకలం రేపుతోంది. వరంగల్ అర్భన్ జిల్లా ఎల్కతుర్తి మండలం జిలుగులకు చెందిన తిరుపతిరెడ్డి అరుణ దంపతులకు ప్రతిభారెడ్డి, రక్షణారెడ్డి కూతుళ్ళు ఉన్నారు. వీరితో పాటు మరో కుమారుడు కూడ ఉన్నారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం రాయికల్‌కు చెందిన రావుల రవీందర్ రెడ్డి రాజేశ్వరీ దంపతుల కుమారుడు ప్రవీణ్ రెడ్డితో ప్రతిభారెడ్డికి మూడేళ్ళ క్రితం పెళ్ళైంది. వీరికి రెండేళ్ళ కూతురు కూడ ఉంది. ప్రవీణ్‌రెడ్డి అసిస్టెంట్ ప్రోఫెసర్‌గా పనిచేస్తున్నాడు. అయితేప్రవీణ్‌రెడ్డి భార్య సోదరి అయిన రక్షణారెడ్డి చదువు కోసం నగరంలో ఓ కాలేజీలో చేరింది. మూడేళ్ళుగా అక్క ఇంట్లోనే రక్షణారెడ్డి నివాసం ఉండేది. ఈ తరుణంలోనే రక్షణారెడ్డితో ప్రవీణ్ రెడ్డికి వివాహేతర సంబంధం ఏర్పడింది..ఈ విషయం కుటుంబసభ్యులకు తెలిసింది.
దీంతో పంచాయితీ నిర్వహించారు. రక్షణారెడ్డిని ఇంటికి తీసుకెళ్ళారు. అంతేకాదు ప్రవీణ్ రెడ్డిని కూడ పెద్దలు మందలించారు. అయితే చదువుకు ఇబ్బందులు కాకూడదనే ఉద్దేశ్యంతో రక్షణారెడ్డి తన ఇంటి నుండే వరంగల్‌లోని కాలేజీకి బస్సులో వస్తుండేది. ఉగాది పండుగ కోసం ప్రవీణ్ రెడ్డి సతీమణి ప్రతిభారెడ్డి తన పుట్టింటికి వెళ్ళింది. అయితే ఉగాది పర్వదినం రోజున ప్రవీణ్ రెడ్డి తన స్వస్థలానికి వెళ్ళాడు. అక్కడి నుండే కాలేజీకి వస్తున్నాడు. అయితే ఉగాది పర్వదినం సందర్భంగా ఇంటికి వెళ్ళిన ప్రతిభారెడ్డి రాలేదు. అయితే ప్రతిరోజూ మాదిరిగానే కాలేజీ కోసం వరంగల్‌కు వచ్చిన రక్షణారెడ్డి సాయంత్రమైనా ఇంటికి రాలేదు. దీంతో రక్షణారెడ్డికి కుటుంబసభ్యులు ఫోన్లు చేశారు. కానీ, ఆమె ఫోన్ పనిచేయలేదు. ప్రతిభారెడ్డి తండ్రితో కలిసి వరంగల్‌లోని తన ఇంటికి వెళ్ళి చూసేసరికి రక్షణారెడ్డి మంచంపై శవమై పడి ఉంది. రక్షణారెడ్డి బెడ్‌మీద చనిపోయి ఉండగా ఆమె బెడ్ పక్కనే ప్రవీణ్ రెడ్డి మృతదేహం పడి ఉంది. రక్షణారెడ్డిని చంపేసి ప్రవీణ్ రెడ్డి ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అయితే ప్రవీణ్ రెడ్డి ఆత్మహత్యచేసుకోవాలని నిర్ణయం తీసుకొన్నాడని పోలీసులు చెప్పారు. ఐదు రోజుల క్రితమే ప్రవీణ్ రెడ్డి సూసైడ్ నోట్ రాశాడు.ఈ నోట్ ప్రకారంగా పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు