లగడపాటి రాజగోపాల్ అంటే టక్కున గుర్తుకు వచ్చేది ప్రస్తుత పరిస్థితులపై ..రాజకీయ పార్టీల భవిష్యత్తుపై సర్వేలు నిర్వహించి ఫలితాలను వెల్లడించే ఏపీ అక్టోపస్ గా పేరుగాంచాడు.రాష్ట్ర విభజన జరిగితే రాజకీయాలకు శాశ్వతంగా దూరంగా ఉంటాను ..రాజకీయ సన్యాసం తీసుకుంటా అని సవాలు చేసి ..రాష్ట్ర విభజన జరగ్గానే తన ఎంపీ పదవికి రాజీనామా చేయడమే కాకుండా ఏకంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.
తాజాగా ఆయన కుటుంబానికి చెందిన ల్యాంకో తీస్తా హైడ్రో పవర్ లిమిటెడ్ ,ఐసీఐసీఐ సహా పలు బ్యాంకుల నుండి మొత్తం 313.10కోట్ల రూపాయలను రుణంగా తీసుకొని తిరిగి చెల్లించడంలో విఫలమైనట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే సరిగ్గా పదకొండు ఏళ్ళ కిందట 2007లో సిక్కిం రాష్ట్రంలోని తీస్తా నదిపై ఐదు వందల మెగావాట్ల జల విద్యుత్ కేంద్రం నిర్మాణం కోసం ఐసీఐసీఐ నేతృత్వంలో పలు బ్యాంకు ల నుండి కన్సార్టియం నుండి ల్యాంకో సంస్థ రూ నాలుగు వందల కోట్లను రుణంగా తీసుకుంది.అయితే ఈ రుణాలను తీర్చడంలో విఫలం కావడంతో గతంలో దిన్ని మొండి బకాయిల కిందట చేరుస్తున్నట్లు ఐసీఐసీ ఐ పేర్కొంది