తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు ఈ రోజు శుక్రవారం ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించారు.పర్యటనలో భాగంగా వనపర్తి జిల్లాలో పలు అభివృద్ధి పథకాలను ఆయన శంఖుస్థాపనలు చేశారు.అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కేటీ రామారావు ఉమ్మడి పాలమూరు జిల్లా పచ్చబడుతుంటే ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతల
కళ్ళు మండుతున్నాయి అని మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు.
కొత్తకోటలోని వీవర్స్ కాలనీలో మంత్రి పర్యటిస్తూ చేనేత కార్మికుల సమస్యలను అడిగి మరి తెలుసుకున్నారు.ఆ తర్వాత మదనాపురంలో డబుల్ బెడ్ రూమ్స్ ఇండ్లకు శంఖుస్థాపన చేశారు.మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పట్లో పాలమూరు ఎంపీగా ఉండి తెలంగాణను సాధించారు అని మరోసారి గుర్తు చేశారు.
గత పాలకులు పాలమూరును వలసల జిల్లాగా మారిస్తే ప్రభుత్వం మాత్రం వలస పోయినవారు తిరిగి వచ్చే విధంగా ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసి నీళ్ళు కరువు లేకుండా చేసిందన్నారు.గత నాలుగేళ్ళుగా పాలమూరు అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని మంత్రి అన్నారు ..