అవును, సుప్రీం కోర్టు తాజాగా ఇచ్చిన తీర్పుతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు జైలు తప్పదా..? అన్న ప్రశ్నకు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఖచ్చితంగా అమలైతే సీఎం చంద్రబాబు నాయుడు జైలుకెళ్లడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే, ఇంతకీ సుప్రీం కోర్టు ఇచ్చిన ఆ తీర్పేమిటి..? రాజకీయ విశ్లేషకులు చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయమంటూ ఖచ్చితం అని ఎందుకు చెబుతున్నారు..? ఓ సారి అసలు విషయంపై ఓ లుక్కేద్దాం..!!
see also :
జగన్‌పై కేసులు నిలబడవు..!!
క్రిమినల్, సివిల్, అవినీతికి పాల్పడిన వారిపై పోలీసు స్టేషన్‌లలో కేసు నమోదవడం, ఆపై ఆ కేసులు కోర్టులో విచారణ జరిగి తమకు శిక్ష పడుతుందన్న భయంతో కొందరు రాజకీయ నాయకులతోపాటు పలువురు, కేసుకు సంబంధించిన విచారణ జరగకుండా స్టేలు తెచ్చుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే విషయమై సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఇకపై స్టేలు ఇచ్చే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించి, విచారించి, స్టే ఇవ్వడానికి కారణాలతో పాటు ప్రజలకు జవాబు చెప్పగల కారణాలు ఉన్నప్పుడే స్టేలు ఇవ్వాలని కిందిస్థాయి కోర్టులకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేయడంతోపాటు పలు సూచనలు కూడా చేసింది. ఇప్పటి వరకు స్టేలు తీసుకున్న వారి కేసుల విచారణను వేగవంతం చేయాలని నిర్ణయించింది సుప్రీం కోర్టు.
సుప్రీం కోర్టు అలా తీర్పునిచ్చిందో, లేదో.. టీడీపీలో అలజడి రేగింది. అయితే, దేశంలో ఏ రాజకీయ నాయకుడిపై లేనన్ని కేసులు, అంతేకాకుండా, ఏ రాజకీయ నాయకుడు తెచ్చుకోనన్ని కేసుల్లో చంద్రబాబు నాయుడు స్టేలు తెచ్చుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఓటుకు నోటు కేసుతో కలిపి చంద్రబాబు ఇప్పటి వరకు తెచ్చుకున్న స్టేల సంఖ్య 18 అన్నది జగమెరిగిన సత్యం. సుప్రీం కోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు నేపథ్యంలో చంద్రబాబుపై ఉన్న స్టేలన్నీ తొలగి, కేసులు విచారణకు వచ్చే అవకాశం ఉందని, చంద్రబాబు నాయుడు మళ్లీ జైలుకెళ్లక తప్పదన్నది రాజకీయ విశ్లేషకుల భావన.
see also :