వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పై టీడీపీ నేత వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇవాళ మీడియాతో మాట్లాడిన వర్ల రామయ్య జగన్ చేస్తున్న ప్రజా సంకల్ప యాత్రలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై లేనిపోని విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారని, అవి తనను చాలా బాధించాయని చెప్పారు. వైఎస్ జగన్ ఏ సామాన్యుడు కూడా వినని, అనని మాటలను మాట్లాడుతూ.. వైసీపీ నేతలు, నాయకులతో కూడా మాట్లాడిస్తున్నారన్నారు. జగన్మోహన్రెడ్డి.. నీ కుటుంబ నేపథ్యం నీకేమన్నా గుర్తుందా..? లేక మరిచిపోయావా..? అని ప్రశ్నించారు వర్ల రామయ్య.
మూడేళ్ళుగా అక్క ఇంట్లోనే ఉండి బావతో మరదలు అక్రమ సంబంధం..చివరికి షాక్
నీతోపాటు జైల్లో ఉన్న విజయసాయిరెడ్డిని రాజ్యసభ సభ్యుడిని చేశావు, సారా, వైన్ మాఫియాను ప్రోత్సహించి, అడ్డగోలుగా ధనం ఆర్జించిన బొత్స సత్యనారాయణను పక్కనే కూర్చోబెట్టుకున్నావు. ఇదీ నీ అవినీతికి నిదర్శనం కాదా..? అని జగన్‌ను ప్రశ్నించారు వర్ల రామయ్య. కేవలం ఒక్క జగన్ మోహన్‌రెడ్డి వల్లే 12 మంది ఐఏఎస్ అధికారులు జైలుకెళ్లారన్నారు. జగన్ కేసులో ఏ2 నిందితుడుగా ఉన్న విజయసాయిరెడ్డి అయితే రెచ్చిపోయి, పరిధిదాటి మాట్లాడుతున్నారని, నోరు అదుపులో పెట్టుకోవాలని తీవ్ర పదజాలంతో హెచ్చరించారు వర్ల రామయ్య.