అవును, ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌పై పెట్టిన కేసులన్నీ కుట్రపూరితమైనవేనన్న విషయాన్ని ఒప్పుకున్నారు సీబీఐ మాజీ డైరెక్టర్, మహారాష్ట్ర అదనపు డీజీపీ పదవికి ఇటీవల రాజీనామా చేసిన జేడీ లక్ష్మీ నారాయణ. జగన్ మీద వచ్చే విమర్శలన్నీ ఆరోపణలే. అందుకే వైఎస్ జగన్‌పై ఉన్న కేసులన్నీ వీగిపోతాయి. వైఎస్ జగన్ తన తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎలాంటి లాబీ చేయలేదు. అటువంటప్పుడు జగన్‌పై కేసులు ఎలా నిలబడతాయి అన్న సంకేతాలను ఇచ్చారు జేడీ లక్ష్మీ నారాయణ.
అయితే, ఇటీవల ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ చీఫ్ రమాకాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌పై ఉన్న అక్రమ కేసుల విషయాలను, అలాగే, అక్రమ కేసుల దర్యాప్తులో ఉన్న లొసుగులను పూసగుచ్చినట్లు వెల్లడించారు.
see also : రైల్వేశాఖలో మరో 20,000 ఉద్యోగాలు..మొత్తం లక్ష పదివేలు..!
ఒకాయన ఓ ప్రైవేటు కేసును హైకోర్టులో వేశారండీ. ఆ కేసును విచారించమని హైకోర్టు సీబీఐకి ఆర్డర్స్ ఇచ్చింది. ఆ సమయంలో సీబీఐకి డైరెక్టర్‌గా జేడీ లక్ష్మీ నారాయణ ఉన్నారు. ఆ సమయంలోనే నేను చీఫ్ సెక్రటరీగా రిటైర్డ్ అయి, ఎన్నికల కమిషనర్‌గా ఉన్నప్పుడు జేడీ లక్ష్మీనారాయణ ఫోన్ చేసి నన్ను విచారణకు రమ్మన్నారు. ఆ వెంటనే విచారణకు హాజరయ్యానని, ఆ సమయంలోనే సీబీఐ కేసుల్లో ఉన్న డొల్లతనం తనకు ప్రస్పుటంగా కనపడిందన్నారు.
see also : 774కోట్లను వాటాలు వారిగా పంచుకున్న తమ్ముళ్ళు ..!
విచారణ నిమిత్తం సీబీఐ ఆఫీసుకు వెళ్లగానే.. జేడీ లక్ష్మీనారాయణ నన్ను ఓ రూములోకి తీసుకెళ్లి.. మా మొత్తం ఆఫీసులో ఈ రూములోనే ఎయిర్ కండీషనర్ ఉంది. మీ సౌలభ్యం కోసం నేను పక్క రూములో ఉంటానని జేడీ లక్ష్మానారాయణ తనతో చెప్పారన్నారు. ఆ సమయంలోనే జేడీ లక్ష్మీనారాయణను నేను కాసేపు ప్రైవేట్‌గా మాట్లాడా. ఆ సమయంలో నేను అడిగిన ప్రశ్నలకు జేడీ లక్ష్మీనారాయణ నవ్వుతూనే సమాధానం నుంచి తప్పించుకున్నారని మీడియా ముఖంగా చెప్పుకొచ్చారు రమాకాంత్‌రెడ్డి.
see also : రంగస్థలం రివ్యూ
చాలా మంది విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ ఐఏఎస్ లేదా ఐపీఎస్ ర్యాంక్ ఉన్న ఒక అధికారి చేతిలో ఉందనుకుంటారు. అది తప్పు. వారు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అన్న కంట్రోల్ రిమోట్ చీఫ్ సెక్రటరీ చేతిలో ఉంటుందని చెప్పారు. పోలీస్ డిపార్ట్‌మెంట్ కూడా దీనికి మినహాయింపు ఏమీ కాదు. హైకోర్టు మమ్మల్ని ఎన్‌క్వైరీ చేయమని చెప్పలేదు కదా..? మరి మమ్మల్ని ఎందుకు ఎన్‌క్వైరీ చేస్తున్నావని జేడీ లక్ష్మీనారాయణను సూటిగానే ప్రశ్నించానని, అందుకు జేడీ లక్ష్మీనారాయణ చిరునవ్వు నవ్వుతూ, ఏం సమాధానం చెప్పాలో తెలీక తటపటాయించారన్నారు. ఆ నవ్వులోనే ఈ కేసులో ఏదో లొసుగు ఉందని అర్థమైందని చెప్పారు రమాకాంత్‌రెడ్డి. ఆ సమయంలోనే జేడీ లక్ష్మీనారాయణ నవ్వులో ఆయన అశక్తత అర్ధమైందని చెప్పారు.
అంతేకాకుండా, జేడీ లక్ష్మీనారాయణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు గల చట్టాలపై అంతగా అవగాహన లేదని, జగన్‌పై పెట్టిన కేసుల్లోనూ అదే రీతిని అవలంభించారని చెప్పారు రమాకాంత్‌రెడ్డి. ఇలా జగన్‌పై పెట్టిన అక్రమ కేసులను ఎవరు విచారణ చేసినా, చివరకు వైఎస్ జగన్ నిర్దోషిగా బయటకు రావడం ఖాయమని తేల్చి చెప్పారు రమాకాంత్‌రెడ్డి.