Home / MOVIES / రంగ‌స్థలం కూడా ఒక సినిమానేనా..? చ్ఛిచ్ఛీ..!!

రంగ‌స్థలం కూడా ఒక సినిమానేనా..? చ్ఛిచ్ఛీ..!!

మెగా ప‌వ‌ర్ స్టార్‌ రామ్ చ‌ర‌ణ్, అక్కినేని వారి కోడ‌లు స‌మంత హీరో హీరోయిన్లుగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం రంగ‌స్థ‌లం. ఈ చిత్రం ఇవాళ ప్ర‌పంచ వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో రిలీజైన విష‌యం తెలిసిందే. అయితే, టాలీవుడ్‌లో ఏ చిత్రం విడుద‌లైనా రివ్యూ లిచ్చే క‌త్తి మ‌హేష్ రంగ‌స్థ‌లం చిత్రంపై సంచ‌ల‌న‌మైన రివ్యూ ఇచ్చాడు.

see also :

కేసుల మాఫీ కోసం ప్ర‌ధాని కాళ్లుప‌ట్టుకున్న వ్య‌క్తి జ‌గ‌న్..!!

అయితే, ఇవాళ క‌త్తి మ‌హేష్ రంగ‌స్థ‌లం సినిమాపై ఇచ్చిన రివ్యూ సారాంశం చూస్తే..!! హీరో రామ్ చ‌ర‌ణ్ న‌ట‌న కాస్తో.. కూస్తో విభిన్నంగా ఉంద‌ని, కాక‌పోతే, ఆ న‌ట‌న క‌థ‌కు స‌రిప‌డ‌లేద‌న్నారు. క‌థ ప‌రంగా రామ్ చార‌ణ్ పుట్టిన గ్రామంలోనే ఉంటాడు. అత‌ని చెవులు స‌రిగ్గా ప‌నిచేయ‌వు. దాని ద్వారా వ‌చ్చే హాస్యం, బాధ ఇవ‌న్నీ కూడా సినిమా ప‌ర్వాలేదులే అన్న ఫీలింగ్‌ను క‌లుగ‌చేస్తాయ‌న్నారు. అలాగే, స‌మంత‌, ఆది పినిశెట్టి, అన‌సూయ న‌ట‌న చాలా బాగా ఉంద‌ని, కానీ, న‌టీన‌టుల క‌ష్టం ఎంత ఉన్న‌ప్ప‌టికీ పొస‌గ‌ని క‌థ‌, పాత ముత‌క వాస‌న‌లొచ్చే క‌థా క‌థ‌నాల మ‌ధ్య‌లో సినిమాపై ఉన్న ఆస‌క్తి త‌గ్గ‌డ‌మే పెద్ద‌మైన‌స్ అని చెప్పారు క‌త్తి మ‌హేష్‌.

రంగ‌స్థ‌లం చిత్రంలో ఎన్ని అద్భుతాలు ఉన్న‌ప్ప‌టికీ పొస‌గ‌నిక‌థ‌, ప‌ద్ధ‌తులు లేని కార‌ణంతో సాగ‌దీత‌కు గురైన‌టువంటి సినిమాగా మిగులుతుంద‌న్నారు. సంగీతం ప‌రంగా బాగున్న‌ప్ప‌టికి, ఇప్ప‌టికైనా దేవీశ్రీ పాట‌లు పాడ‌క‌పోవ‌డ‌మే మంచిద‌ని స‌ల‌హా ఇచ్చారు. సాంకేతిక ప‌రంగా ఈ చిత్రం అద్భుతంగా ఉన్న‌ప్ప‌టికీ, న‌ట‌న ప‌రంగా అంద‌రూ బాగా చేసిన‌ప్ప‌టికీ క‌థా క‌థ‌నాల వీక్‌నెస్‌, ద‌ర్శ‌క‌త్వంలోని అతీగ‌తీలేని తీరు, చిత్రం నిడివి ఇలా అన్నిటిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటే.. అంత‌గా రంజింప‌ని రంగ‌స్థ‌ల‌మంటూ త‌న రివ్యూను ముగించారు క‌త్తి మ‌హేష్‌.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat