Home / ANDHRAPRADESH / చంద్రబాబే స్టీవ్ స్మిత్ అయితే …!

చంద్రబాబే స్టీవ్ స్మిత్ అయితే …!

ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఇటివల బాల్ టాంపరింగ్ వివాదంతో జట్టు నుండి ,కెప్టెన్ బాధ్యతల నుండి ఏడాది పాటు సస్పెండ్ అయిన సంగతి విదితమే.ఆ తర్వాత స్మిత్ ప్రెస్ మీట్ పెట్టి మరి వివరణ ఇచ్చారు .అయితే “వై.యస్ రాజశేకర్ రెడ్డి గారి అభిమాని”అని నెటిజన్ చంద్రబాబే ఒకవేళ స్టీవ్ స్మిత్ అయితే ప్రెస్ మీట్ ఎలా ఉంటుందో ఒక పోస్టును సోషల్ మీడియాలో వైరల్ చేశారు .మీరు ఒక లుక్ వేయండి ..
జర్నలిస్టులు- సార్. మీ జట్టు బాల్ టాంపరింగ్ చేసిందా?

చంద్రబాబు- మా ఆటగాళ్ల మీద స్టింగ్ అపరేషన్ చేస్తారా? జేబులో ఏముందో ప్రజలకు చూపిస్తారా? మా ఆటగాడు ప్యాంటు బొందెలు ఇప్పుకోవడం, కట్టుకోవడం, లోపల చెయ్యి పెట్టుకోవడం అన్నీ రికార్డు చేసి చూపిస్తారా? ఇదేనా అండీ మన సంస్కారం. మనం ఎటు పోతున్నాం ఒక్కసారి మీరందరూ ఆలోచన చేసుకోండి..

జర్నలిస్టులు- సార్.. మిమ్మల్ని బ్యాన్ చేసే అవకాశం ఉందంటున్నారు.

స్టీవ్ బాబు- నన్ను బ్యాన్ చేస్తారా? తెలుగు జాతి ప్రజల ఆత్మగౌరవాన్ని గంగలో కలుపుతారా? అసలు టెస్టు క్రికెట్లో నా రికార్డులు చూడండి, కెప్టెన్ గా నా రికార్డులు చూడండి. నా బ్యాటింగ్ యావరేజీ ఎంతో తెలుసా? నాకు తెలీదా బాల్ టాంపరింగ్ అంటే.. తెలీకుండానే ఇన్నేళ్లు క్రికెట్ ఆడుతున్నానా, ఇన్నేళ్లు కెప్టెన్ గా చేస్తానా. ఎక్కడా ఒక్క మచ్చ లేకుండా బతుకుతున్నవాన్ని. ఇది తెలుగుజాతిని నిర్వీర్యం చేసే కుట్ర.

జర్నలిస్టులు- కొంచెం వివారిస్తారా సార్..

స్టీవ్ బాబు- ఇదంతా బీసీసీఐ చేయించిన ఆపరేషన్ లవ్ De Ke ‘బాల్’ లో భాగం. ‘స్యాండ్’ పేపర్ జేబులో పెట్టుకొని రావాల్సిన ఖర్మ మాకుందా ఒక్కసారి ఆలోచన జేసుకోండి. అవసరమైతే ఒక లోడు ‘స్యాండ్’ లారీ తెచ్చుకుంటాం గానీ.. నేను అన్నీ చెప్పలేను. మిగతావి మా మీడియా చెప్తుంది.

అలిసిపోయిన జర్నలిస్టులు – సార్ ఇంతకీ మీ జట్టు టాంపరింగ్ చేసిందా, లేదా?

స్టీవ్ బాబు- వాట్ ఐ యామ్ సేయింగ్… ఇప్పుడు మనకి బంతులేమైనా కొదవా చెప్పండి. ఒక బాల్ కాకపోతే ఇంకో బాల్ తో క్రికెట్ ఆడొచ్చు. బాల్ టాంపరింగ్ అంటే బంతి రూపం మార్చడమే కదా! బంతి రూపం, రంగు, రుచి మారకుండానే క్రికెట్ ఆడటం సాధ్యమవుతుందా మీరే ఆలోచన చేసుకోండి. అప్పటికీ మా జట్టు మాకోసం ‘స్పెషల్’ బంతులు అడుగుతున్నాం. ‘స్పెషల్’ బంతులు ఎవరికీ ఇవ్వరు అని ఐసీసీ కథలు చెప్తోంది. పాత బంతుల లెక్కలు అడుగుతోంది. పాత బంతి లెక్కలేందో అర్థం కావడం లేదు. ఎప్పుడెప్పుడు ఏయే బాల్ తో ఆడుతున్నామో అంతా లైవ్ లో కనిపిస్తోంది కదా. మళ్లీ దానికి లెక్కలు అవసరమా?

ఉత్సాహంగా జర్నలిస్టులు- లైవ్ లో టాంపరింగ్ చెయ్యడం కూడా కనిపించింది కదా సార్..

స్టీవ్ బాబు- వాట్ ఐయామ్ సేయింగ్…

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat