మనం చూశం చాల సార్ల్ ఆన్ లైన్ లో మనం ఆర్డర్ ఇచిన సమయం కంటే చాల లేటుగా వస్తుంటాయి. అలా వచ్చినప్పుడు మనం కొంచెం కోపం చూపిస్తుంటాము. తాజాగా ఓ మహిళ విచక్షణ కోల్పోయి…క్షణికావేశంలో… ఓ వ్యక్తిని తీవ్రంగా గాయపర్చింది. ఈ సంఘటన ఢిల్లీలోని నిహల్ విహార్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… తను ఫ్లిప్‌కార్ట్‌లో బుక్ చేసుకున్న స్మార్ట్‌ఫోన్… ఆలస్యంగా తీసుకొచ్చాడని… ఓ మహిళ… డెలివరీ బాయ్‌పై దాడికి దిగింది. కత్తితో 20సార్లు పొడిచి… తీవ్రంగా గాయపర్చింది. ఈ దారుణ ఘటన అంతా అక్కడి సీసీటీవీలో రికార్డవడంతో … విషయం బయటకు తెలిసింది.
నిహల్ విహార్‌లోని… అంబికా ఎన్‌క్లేవ్‌లో నివసించే 30ఏళ్ల మహిళ… ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసింది. ఫోన్‌ను డెలివరీ చేసేందుకు… కేశవ్ అనే డెలివరీ బాయ్ ఆమె ఇంటికి వెళ్లాడు. ఈ నేపథ్యంలో… ఫోన్ ఎందుకు ఆలస్యంగా తీసుకొచ్చావని… కేశవ్‌తో వాగ్వాదానికి దిగింది. గొడవ పెద్దది కావడంతో… సహనం కోల్పోయిన… ఆ మహిళ డెలివరీ బాయ్‌ను కత్తితో 20 సార్లు దారుణంగా పొడిచింది. ఈ దారుణ ఘటన అంతా అక్కడి సీసీటీవీలో రికార్డవడంతో… తీవ్ర గాయాలపాలైన కేశవ్‌ను సమీపంలోని సంజయ్ గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని… దర్యాప్తు చేస్తున్నారు. మహిళను, ఆమె సోదరుడిని పోలీసులు అరెస్టు చేశారు.