అటల్ బీహారీ వాజ్ పేయి గతంలో భారతప్రధాన మంత్రిగా పని చేసి దేశ భవిష్యత్తును అన్ని రంగాల్లో ఉరకలేత్తించిన ఆదర్శమైన సీనియర్ నేత .అట్లాంటి మాజీ ప్రధాన మంత్రి చనిపోయారు అంటూ సోషల్ మీడియాలో వార్తలను ప్రచారం చేస్తున్నారు నెటిజన్లు.
ప్రస్తుతం కేంద్రంలో అధికార పార్టీ అయిన బీజేపీ పార్టీలో కీలకమైన వ్యక్తుల్లో ఒకరైన అటల్ బీహారీ వాజ్
పేయి (93)మరణించారు అని అంటూ వాట్సాప్ ,ట్విట్టర్ ,ఫేస్బుక్ ఇతర సోషల్ మీడియాలలో వార్తలను ప్రచారం చేస్తున్నారు.
అయితే గారంలో సరిగ్గా మూడు యేండ్ల కిందట అంటే 2015లో ఇలాగే వాజ్ పేయి మరణించారు అని అసత్యమైన వార్తలను ప్రసారం చేశారు.అయితే దేశానికి ఎన్నో రకాలుగా సేవలందించి ..ప్రస్తుతం భారతావని భవిత మారడానికి కారణమైన వాజ్ పేయి మరణించారని ఇలాంటి వార్తలు చాలా బాధాకరం ..దురదృష్టకరం ..