ఏపీలో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అధికార టీడీపీ పార్టీలో ఎన్నికలకు ముందే ముసలం మొదలైంది.స్థానిక నియోజక వర్గ ఎమ్మెల్యే ,మంత్రి భూమా అఖిల ప్రియ ,మాజీ ఆర్ఐసీ చైర్మన్ ,టీడీపీ నాయకుడు ,దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ముఖ్య అనుచరుడు ఏవీ సుబ్బారెడ్డి మధ్య ఉన్న విభేదాలు తారాస్థాయికి చేరాయి. భూమా కుటుంబానికి సన్నిహితుడిగా ఉంటూ వస్తున్న ఎవి సుబ్బారెడ్డి కి, అఖిలప్రియకు మద్య తగాదా ముదిరింది. సుబ్బారెడ్డి మాట్లాడుతూ ‘భూమా నాగిరెడ్డి బతికుంటే నన్ను గుంటనక్కలు అని సంబోధించినందుకు అఖిలప్రియ చెంపలు వాయించి ఇంట్లో కూర్చోమని చెప్పేవాడు. అది మా ఇద్దరి మధ్య అనుబంధం. భూమా నాగిరెడ్డి హీరో అయితే నేను డైరెక్టర్‌ను. సినిమాలో హీరోనే కనబడతాడు. అని వ్యాఖ్యానించారు.
భూమా వర్థంతి సభలో నేను లేకుంటే.. ఆయన ఆత్మ శాంతిస్తుందా?. భూమా నాగిరెడ్డి కోసం ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో నాకు తెలుసు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవకాశం ఇస్తే ఎమ్మెల్యేగా ఆళ్లగడ్డలో పోటీ చేస్తా. ఆళ్లగడ్డలో ఏ సమస్య ఉన్నా నాకు ఫోన్ చేయండి. నా నెంబర్ 7093382333’ అని సుబ్బారెడ్డి అనడం కలకలం రేపుతోంది. అంతేకాదు సుబ్బారెడ్డి అనుచవర్గం దమ్ముంటే మీకు ఆదేశాలను జారీచేసిన మంత్రి అఖిల ప్రియను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమని సుబ్బారెడ్డి అనుచవర్గం భూమా అఖిల ప్రియ అనుచవర్గానికి సవాళ్ళు ప్రతి సవాళ్ళు విసరడంతో ఆళ్లగడ్డలో పరిస్థితులు ఉద్రిక్తంగా తయారయ్యాయి.