అధికారంలోకి వచ్చినప్పటినుండి తెలుగుదేశం పార్టీ పాలనలో ప్రజలు పడుతున్న బాధలను తెలుసుకునేందుకు వైసీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర అశేశ ప్రభజనం మద్య కొనసాగుతోంది. ఈ పాదయాత్రకు అడుగడుగునా జనాలు నీరాజనాలు పలుకుతున్నారు. జగన్, కాబోయే సీఎం అంటూ పాదయాత్ర పొడవునా యువత నినాదాలు చేస్తున్నారు. వైఎస్ జగన్ ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలుకరిస్తూ, వారి సమస్యలను సావధానంగా వింటూ, అండగా ఉంటానని భరోసా ఇస్తూ ముందుకు కదులుతున్నారు. అంతేగాక నడవలేని అవ్వ..నిలబడలేని తాత..మాటలు కూడ రాని చిన్నారులు…ఇలా వేల మంది వైఎస్ జగన్ తో అడుగులో అడుగు వేస్తున్నారు. మీరు రావలయ్యా ఏపీలో మీ తండ్రి లాంటి పాలన కావలయ్యా అంటూ వైఎస్ జగన్ తోనే ప్రజలు చెబుతున్నారు. వారి మాటలకు జగన్.. ఖచ్చితంగా మీ అందరి ప్రేమాభిమానంతో రాబోయో ఎన్నికల్లో మనందరి ప్రభుత్వం రాగనే మీకు కష్టాలు అనేవి లేకుండ చెద్దాం అని భరోస ఇస్తున్నారు. ఇకపోతే 123వ రోజు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర గురువారం ఉదయం గుంటూరు జిల్లా గుడిపూడి శివారు నుంచి ప్రారంభమైంది. అక్కడ నుంచి పెదమక్కెన, పెదకూరపాడు వరకూ ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది. అనంతరం పెదకూరపాడులో జరగబోయే బహిరంగసభలో వైఎస్ జగన్ ప్రసంగిస్తారు.
