ఈస్టర్ పండుగ రోజున యేసుక్రీస్తును అనునిత్యం తలుస్త క్రైస్తవ ధర్మాన్ని ఆద్యాంతం పాటించే వారు ఆ రోజంతా చర్చీల్లోనే గడుపుతారు. అంతేకాకుండా, వారిమనసంతా దైవమందే లగ్నం చేసి యేసుక్రీస్తు కోసం ప్రార్ధనలు చేస్తారు. యేసుక్రీస్తు తిరిగి భూలోకానికి వచ్చిన సందర్భంగా కృతజ్ఞతతో ఉపవాస ప్రార్ధనలు నిర్వహిస్తారు.
ఈస్టర్ రోజునే యేసుక్రీస్తు పునరుజ్జీవుడై, సజీవంగా తిరిగి భూలోకానికి చేరిన సందర్భంలో క్రైస్తవ సోదరులు చర్చీల్లో శిలువును ఉంచి, కన్నీటి ప్రార్ధనల నడుమ క్రీస్తును కీర్తిస్తారు. ఆ రోజున 12 గంటల తరువాత క్రైస్తవ ధర్మాన్ని పాటించే వారు క్రీస్తు తన సేవలను కొనియాడుతూ ప్రత్యేక ప్రార్ధనలు, పాటలను ఆలకిస్తూ బైబిల్ చెప్పే విషయాలను వింటారు. ఆ సందర్భంలోనే ఏసు క్రీస్తు అసలు శిలువ ఎందుకు వేయబడ్డారు.? అన్న విషయాలను మతపెద్దలు బోధిస్తారు. గుడ్ ఫ్రైడేను బ్లాక్‌డేగా కూడా పిలవబడుతుందన్న విషయం తెలిసిందే. ఆ రోజున క్రైస్తవులందరూ నల్లటి దుస్తులు ధరిస్తారు. మూడు రోజుల్లో వచ్చే ఈస్టర్ పండుగ రోజున మాత్రం తెల్లటి దుస్తులు ధరించి యేసు క్రీస్తు సేవలో, ప్రార్ధనలు చేస్తూ యేసు క్రీస్తును కీర్తిస్తారు.