యేసుక్రీస్తును శిలువ వేసిన తరువాత సమాధి చేయబడ్డారని, యేసుక్రీస్తు సమాధి పరిసరాలను శుభ్రం చేయడంతోపాటు.. నీళ్లు చల్లేందుకు వెళ్లిన ఓ స్ర్తీకి యేసుక్రీస్తు సజీవుడై దర్శనమిచ్చారు. అంతకు ముందు సమాధి వద్దకు వెళ్లిన ఆ స్ర్తీకి సమాధి తలుపులు తెరిచి కనబడ్డాయి. దీంతో ఆ మహిళ ఆ విషయాన్ని తన యేసుక్రీస్తు అనుయాయులతో చెప్పింది. దీంతో వారి మది ఆనందంతో వెల్లివిరిసింది. యేసుక్రీస్తు ఇంకా సజీవంగానే ఉన్నాడని తెలుసుకున్న ప్రజలు ఆ సందర్భాన్ని పండుగలా జరుపుకున్నారు. ఈ పండుగ పేరే ఈస్టర్. యేసు క్రీస్తు ఎప్పుడూ సజీవుడే.
అయితే, ఆ స్ర్తీ చెప్పిన యేసు క్రీస్తు సజీవుడే అన్న మాట విన్న వారంతా ఆశ్చర్యకితులయ్యారు. అంతేకాకుండా, మహిళ క్రీస్తు అనుయాయులకు మరో మాట కూడా చెప్పింది. అదే యేసు క్రీస్తు చెప్పిన మాట. అదేమిటంటే..!! నా ప్రజలకు చెప్పు.. వారిని కలుసుకునేందుకు త్వరలో వస్తాను అంటూ ఆ మహిళతో యేసు క్రీస్తు చెప్పాడని క్రైస్తవ ధర్మం చెబుతోంది.