ఈస్టర్, యేసు క్రీస్తు శిలువ వేయబడ్డ రోజును గుడ్‌ఫ్రైడేగా పేర్కొంటూ, అలాగే, యేసు క్రీస్తు పాపుల్ని ద్వేషించకు, పాపుల్ని ద్వేషించు అన్న సందేశాన్ని తెలుపుతూ తిరిగి తన మరణం (సమాధి నుంచి) సమాజంలోకి ప్రవేశించిన దినమును ఈస్టర్‌గా పేర్కొంటారు. యేసుక్రీస్తు తన సమాధి నుంచి తిరిగి లేచిన దినమును క్రైస్తవ సోదరులు ఈస్టర్‌గా పేర్కొంటూ పండుగ వాతావరణంలో ప్రార్థనా మందిరాల్లో యేసు క్రీస్తు సేవలో ఉండిపోతారు. ఇదే రోజు క్రైస్తవులందరూ ప్రార్ధనా మందిరాలకు వెళ్లి.. యేసు క్రీస్తు యొక్క జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడమే కాకుండా, మరికొందరు కల్వరి సందర్శనార్ధం పయనమవుతుంటారు.
ఇలా చేస్తే బాధలన్నీ దూరం..!!
క్రైస్తవులు ఎంతో పవిత్ర దినంగా పేర్కొనే ఈస్టర్ పండుగ రోజున యేసుక్రీస్తును మనసారా, అష్టనిష్టలతో ప్రార్ధిస్తే వారి పాపాలన్నీ తొలగి, వారికి మంచి మనస్సుతోపాటు మంచి భవిష్యత్తును యేసు క్రీస్తు దరిచేరుస్తారని క్రైస్తవ ధర్మాన్ని ఆచరించే వారు చెబుతున్న మాట. అంతేకాకుండా, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ఇలా ఆ వారమంతా పవిత్రతో భావిస్తారు. ఆ ఏడు రోజులు నిష్టతో ఉపవాసం ఉండి, ఈ రోజు రోజున తీసుకునే విందు వల్ల వారి రక్తం శుద్ది చేయబడుతుందని, అలాగే, వారి బాధలన్నీ దూరం చేయబడతాయన్నమాటను క్రైస్తవ ధర్మం చెబుతోంది.