ఏపీ లో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ టీడీపీ పార్టీలో నెలకొన్న విభేదాలను మరిచిపోకముందే తాజాగా విజయనగరం జిల్లాలో బొబ్బిలి లో అప్పటివరకు ఉన్న తెలుగు తమ్ముళ్ళ మధ్య విభేదాలు ఒక్కసారిగా బయటకు వచ్చాయి.ఈ రోజు గురువారం టీడీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఫిరాయింపు ఎమ్మెల్యే ,మంత్రి సుజయ కృష్ణ రంగారావు సాక్షిగా టీడీపీ
నేతలు ,ఫిరాయింపు నేతలు తన్నుకున్నారు .
See Also:వైసీపీపై టీడీపీ నేతల కుట్రలు అందరికీ తెలిసేలా షేర్లు కొట్టండి ..!
ఒకానొక సమయంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకొని తీవ్రంగా గాయపరుచుకున్నారు.ఈ రోజు టీడీపీ అవతరణ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీలో పాతికేళ్ళుగా ఉన్న తమకు ప్రాధాన్యత ఇవ్వకుండా పార్టీ ఫిరాయించి వచ్చిన నేతలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు మంత్రి అనుచవర్గం మీద దాడికి దిగారు.దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ..అంతే కాకుండా తీరు మార్చుకోకపోతే అందరం రాజీనామా చేస్తామని టీడీపీ నేతలు ,కార్యకర్తలు హెచ్చరించారు మంత్రి అనుచవర్గాన్ని ..
See Also:వైసీపీలోకి సీనియర్ స్టార్ హీరో ..ఎంపీ సీటు ఖరారు …!