ఏపీలో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అధికార టీడీపీ పార్టీలో అప్పుడే ముసలం మొదలైంది.స్థానిక నియోజక వర్గ ఎమ్మెల్యే ,మంత్రి భూమా అఖిల ప్రియ ,మాజీ ఆర్ఐసీ చైర్మన్ ,టీడీపీ నాయకుడు ,దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ముఖ్య అనుచరుడు ఏవీ సుబ్బారెడ్డి మధ్య ఉన్న విభేదాలు తారాస్థాయికి చేరాయి.
ఇప్పటికే గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య నెలకొన్న విభేధాల కారణంగా ఇరువ్రురు మధ్యనే కాకుండా ఏకంగా స్థానిక పార్టీ క్యాడర్ మధ్య పచ్చగడ్డి వేస్తె భగ్గుమనేలా పరిస్థితులు నెలకొన్నాయి.తాజాగా ఈ రోజు గురువారం ఆళ్లగడ్డ లో ఏవీ హెల్ప్ లైన్ ను సుబ్బారెడ్డి ఏర్పాటు చేశారు.
ఈ హెల్ప్ లైన్ ప్రారంభోత్సవానికి భూమా వర్గీయులు హాజరు కాకుండా మంత్రి అఖిల ప్రియ ఆదేశాలతో ఆమె అనుచరవర్గం అడ్డుకోవడానికి ప్రయత్నాలు మమ్మురం చేసింది.దీంతో ఇరువురు మధ్య గొడవలకు దారితీసింది.ఈ సందర్భంగా సుబ్బారెడ్డి అనుచవర్గం దమ్ముంటే మీకు ఆదేశాలను జారీచేసిన ఎమ్మెల్యే ,మంత్రి అఖిల ప్రియను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమని సుబ్బారెడ్డి అనుచవర్గం భూమా అఖిల ప్రియ అనుచవర్గానికి సవాళ్ళు ప్రతి సవాళ్ళు విసరడంతో ఆళ్లగడ్డలో పరిస్థితులు ఉద్రిక్తంగా తయారయ్యాయి. ఆళ్లగడ్డలో పరిస్థితులు ఉద్రిక్తంగా తయారయ్యాయి.