ఆంద్రప్రదేశ్ లో అదికారంలో ఉన్న టీడీపీ నేతలు చేసే నేరాలను ఎప్పటికప్నుడు నిలదీస్తూ..ప్రజలకు భరోసా ఇస్తున్నారు ప్రతి పక్షంలో ఉన్న వైసీపీ నేతలు. దేశంలో ఏ రాజకీయ నాయకుడు తలపెట్టని విధంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రజా సంక ల్పయాత్ర చేపట్టి 1600 కిలోమీటర్లు పూర్తి చేసుకొని సత్తెనపల్లిలోకి ప్రవేశించడం చరిత్రాత్మక సంఘటన. పాదయాత్రలో బాగంగా మంగళవారం జరిగిన బహిరంగ సభలో అంబటి మాట్లాడారు. . ప్రజా సంకల్ప యాత్రతో సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని ఎద్దేవాచేశారు. గాంధేయవాది వావిలాల గోపాలకృష్ణయ్య పాలించిన గడ్డ సత్తెనపల్లి నియోజకవర్గమని గుర్తుచేశారు. ఇప్పుడు సత్తెనపల్లిలో కోడెల కుటుంబం దుర్మార్గంగా పాలిస్తోందన్న విమర్శలు ఉన్నాయని పేర్కొన్నారు.వైద్యంలోనే కాకుండా కరప్షన్‌లో కూడా కోడెల కుటుంబీకులు డాక్టరేట్ పొందారని అంబటి రాంబాబు విమర్శించారు.
924 ఓట్లతో గెలుపొందిన కోడెల సత్తెనపల్లిలో చేస్తున్న అక్రమాల గురించి ఎవరిని అడిగినా చెబుతారన్నారు. ఈ తీరును వావిలాల వారసులు సహించగలరా అని ప్రశ్నించారు. మరుగుదొడ్లు, శ్మశాన వాటికల అభివృద్ధి నిధుల్లోనూ కమీషన్ గుంజుకుంటున్నారని, ఇక్కడ దోచుకున్న కోట్ల రూపాయలతో గుంటూరులో మల్టీఫ్లెక్స్ నిర్మిస్తున్నారని విమర్శించారు. మల్టీఫెక్స్ నిర్మాణ పనులను సత్తెనపల్లి, నరసరావుపేట మున్సిపాలిటీల పారిశుద్ధ్య కార్మికులతో చేయిస్తున్నారని వివరించారు. కార్మికులను తీసుకెళ్తుంటే మున్సిపల్ కమిషనర్లు ఏమిచేస్తున్నారని మండిపడ్డారు. 150 ఏళ్ల నుంచి గొడుగుల సుబ్బారావు కుటుంబం అనుభవిస్తున్న భూమిని కాజేసి శశి ఇన్‌ఫ్రాగా పేరు మార్చాని విమర్శించారు. నడికుడి రైల్వేట్రాక్ పనులు ముగ్గురు కాంట్రాక్టర్లు చేపడితే కోడెల కొడుకు రూ.15 కోట్లు అడిగారని, ఇవ్వలేదని వారి శిబిరాలపై దాడులు చేశారని, ఈ విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించినా పెడచెవిన పెట్టారని విమర్శించారు. దీంతో కోడెలను పిలిచి చెబితే ‘మా అబ్బాయి అవినీతి సరే.. మరి మీ అబ్బాయి చేసేదేమిటని ఎదురు ప్రశ్నించి ఆయన నోరు మూశారు’ అని పేర్కొన్నారు. అవినీతికి పాల్పడుతున్న పాలకులను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.