ఏపీలో ప్రస్తుతం టీడీపీ నేతలు పార్టీ మారుతున్నారు. వీరిలో మహిళ నేతలు కూడ ఉండడం చర్చనియాసం అయ్యింది. మొన్నటికి మొన్న ఎన్నో సంవత్సరాలుగా టీడీపీ ఉన్న మహిళ నేత కవిత బీజేపీ చేరారు. తాజాగా విశాఖ జిల్లాలోని కేజేపురం మండలం ఎంపీ టీసీ సభ్యురాలు రాపేటి నారాయణమ్మ తెలుగు దేశం పార్టీకి రాజీనామాచేయనున్నట్టు ప్రకటించారు. మంగళవారం ఆమె ఇక్కడి విలేఖరులతో మాట్లాడారు. వైసీపీ తరఫున ఎంపీటీసీ సభ్యురాలిగా ఎన్నికైన తాను గ్రామాభివృద్ధి దృష్యా టీడీపీలో చేరానని, అయితే పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి గవిరెడ్డి రామానాయుడు ఇప్పటి వరకు ఒక్కరూపాయి కూడా మంజూరు చేయకుండా అన్యాయం చేశారని ఆరోపించారు. తమ గ్రామానికి చెందిన రాపేటి జగ్గారావు పింఛన్ పొందేందుకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ మంజూరు చేయడం లేదనిఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కార్యక్రమాల్లో గాని, ఇతర సమా వేశాల్లో గాని తనకు ఎలాంటి ప్రత్యేకత ఉండ డం లేదన్నారు.ఈనేపథ్యంలో తాను రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు.
