ప్రస్తుతం ఆస్ట్రేలియా క్రికెట్ ను కుదిపేస్తున్న అంశం బాల్ ట్యాంపరింగ్ వివాదం.ఈ వివాదంలో ప్రధాన సూత్రధారిగా డేవిడ్ వార్నర్ మీద స్వయంగా బోర్డు అధికారులే వ్యాఖ్యలు చేయడం సన్ రైజర్స్ అఫ్ హైదరాబాద్ ఆలోచనలో పడింది.అనుకున్నది తడవుగా ఇప్పటివరకు కెప్టెన్ గా ఉన్న డేవిడ్ వార్నర్ ను ఆ బాధ్యతల నుండి తప్పిస్తున్నట్లు సన్ రైజర్స్ మేనేజ్మెంట్ ఈ రోజు బుధవారం ప్రకటించింది.త్వరలోనే కొత్త సారధిని నియమించి వివరాలు ప్రకటిస్తామని ఆ సంస్థ సీఈవో కె షణ్ముగం మీడియాకు వివరించారు ..
