ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తెలుగు చిత్ర సీమ నిప్పులు చెరిగింది. కాగా, ఇటీవల కాలంలో తెలుగు సినీ ఇండస్ర్టీకి, చంద్రబాబు సర్కార్ మధ్య వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా, టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ ఒక అడుగు ముందుకేసి తెలుగు సినిమా హీరోలు హీరోయిన్లతో రూముల్లో కులుతారని, ప్రజల సొమ్ముతో బతుకుతూ, ప్రజల సమస్యలపై పోరాడేందుకు బయటకు రారంటూ తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ చేసిన ఈ వ్యాఖ్యలపై తమ్మారెడ్డి భరద్వాజ, పోసాని కృష్ణ మురళీ ఘాటుగానే స్పందించారు.
see also : స్పీకర్ కోడెలకు కోలుకోలేని దెబ్బ..ఇద్దరు టీడీపీ నేతలు జగన్ సమక్షంలో వైసీపీలోకి..!
ఇప్పుడు మా అసోసియేషన్ అధ్యక్షులు శివాజీ రాజా వంతు వచ్చింది. అయితే, మంగళవారం మా అసోసియేషన్ ఏర్పాటు చేసిన సమావేశంలో అధ్యక్షులు శివాజీ రాజా మాట్లాడుతూ.. మా దేవుడు, ప్రముఖ సినీ నటుడు, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పెట్టిన పార్టీలో ఉంటూ, బాలకృష్ణ పార్టీలో ఉంటూ, ఎంపీ మురళీ మోహన్ పార్టీలో ఉంటూ సినీ పరిశ్రమనే విమర్శిస్తారా..? అంటూ ప్రశ్నించారు. చోటా నాయకుల చేత సినీ పరిశ్రమపై విమర్శలు చేయించడం టీడీపీ పార్టీ అధిష్టానం వంతైందన్నారు. ప్రత్యేక హోదాపై మీకే క్లారిటీ లేప్పుడు, పోరాటం చేసేందుకు మమ్మల్ని ఎలా రమ్మని పిలుస్తారని, మీకు ప్రత్యేక హోదా కావాలో..? ప్యాకేజీ కావాలో తేల్చుకుని, అప్పుడు మమ్మల్ని పిలవడం, అప్పుడు వచ్చి ఏపీ ప్రయోజనాల కోసం ఉద్యమించకపోతే మమ్మల్ని విమర్శించండి. వంతే తప్ప ప్రత్యేక హోదాపై మీకే కన్ఫూజన్ ఉన్నప్పుడు మమ్మల్ని పిలవకండీ అంటూ చంద్రబాబు సర్కార్ను ఏకిపారేశారు మా అధ్యక్షులు శివాజీ రాజా.