గత కొన్ని రోజులుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ జరుగుతోంది అంటూ పలువురు నటీమణులు మీడియాకెక్కి రచ్చ చేయడంపై నటి కరాటే కళ్యాణి స్పందించారు. ఎక్కడైన ఎవరికైన టాలెంట్ ఉంటేనే ఎవరైనా అవకాశాలు ఇస్తారు, నా కోసం ప్రత్యేకంగా క్యారెక్టర్లు రాస్తున్నారంటే..ఈమెలో టాలెంట్ ఉంది, డైలాగ్ డెలివరీ బాగా ఉంటుంది అని వారు నమ్మారు కాబట్టే అని కళ్యాణి తెలిపారు.అంతేగాక నన్ను వాడుకున్నారు అని ఆరోపిస్తున్నా వారు…. అలాంటి అవకాశం మీరు ఎందుకు ఇస్తున్నారు? ఫస్ట్ లోనే నేను రాను, నాకు ఇష్టం లేదు, నేను ఆ టైపు కాదు అని చెబితే నిన్ను ఎందుకు అడుగుతారు? నువ్వు ముందు వెళ్లి పూసుకుని, నీ అంతటనువ్వే కాంటాక్ట్స్ పట్టుకుని, ఆ తర్వాత వాళ్లేదో అన్నారని గోల చేయడం ఎందుకు. నీ పబ్లిసిటీ కోసం ఇంకొకరి గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడటం కరెక్ట్ కాదు అని కళ్యాణి అన్నారు. మనం ప్రవర్తించే తీరు బట్టే ఇక్కడ పరిస్థితులు ఉంటాయి. నన్నెందుకు వచ్చి అడగరు? నిన్నే ఎందుకు అడుగుతున్నారు? నీ బిహేవియర్, నీ పర్సనాలిటీ, పద్దతులు, నీ మాటలు బట్టే అవన్నీ ఉంటాయి. అదంతా మనలోనే ఉంటుంది.