ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అప్పటి ఉమ్మడి ఏపీలో అప్పట్లో గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న ప్రస్తుత ప్రధాన మంత్రి నరేందర్ మోదీ హైదరాబాద్ మహానగరానికి వస్తే అరెస్టు చేయాలనీ అని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే.ఆ తర్వాత కొన్నాళ్ళకు రాష్ట్ర విభజన తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ
పార్టీతో మిత్రపక్షంగా ఉండి గెలుపొందాడు.అంతే కాకుండా ఏకంగా కేంద్రంలో తమ పార్టీకి చెందిన ఎంపీలకు మంత్రి పదవులను ఇప్పించుకున్నాడు.
రాష్ట్ర విభజన సమయంలో అప్పటి యూపీఏ సర్కారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని నిర్ణయించింది.రాష్ట్ర విభజన తర్వాత ఎన్నికలు అయిన ఏడు నెలల వరకు ఉన్న ప్లానింగ్ బోర్డు కమిషన్ ను పట్టించుకోకుండా కేంద్రం ప్రత్యేక ఫ్యాకేజీను ప్రకటిస్తే దాన్ని ఆమోదిస్తూ ఏకంగా అసెంబ్లీ లో అభినందన తీర్మానాన్ని చేసి మరి కేంద్రానికి ,ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీకి పంపించారు.ఆ తర్వాత ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ ప్రత్యేక హోదానే ముద్దు అని చేస్తున్న పోరాటాలు ..ఉద్యమాలు ఫలితంగా ప్రజల్లో చైతన్యం వచ్చి రోడ్లపైకి రాగానే బాబు ఉన్నఫలంగా కేంద్రం మోసం చేసిందని ఎన్డీఏ నుండి బయటకోచ్చేసింది.
అంతే కాకుండా మొదట వైసీపీ పార్టీ అవిశ్వాస తీర్మానం పెడతామంటే దాని వలన ఏమి ఉపయోగం అని వెటకారం చేసిన బాబే ఏకంగా అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయం తీసుకున్నాడు.దీనిపై ప్రధాన ప్రతిపక్ష వైసీపీ పార్టీ ఎమ్మెల్యే నారాయణ స్వామీ మాట్లాడుతూ అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకునే నైజం ఉన్నవాడు అని ..గతంలో
చంద్రబాబు మోదీని తిట్టి మరి ఇప్పుడు కాళ్ళు మొక్కరంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలను మీడియాకు విడుదల చేస్తూ ఆయన తెలిపారు ..