తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమ్మ ఒడి వాహనాలను ఇటివల ప్రవేశపెట్టిన సంగతి విదితమే.అందులో భాగంగా ఇప్పటికే నియోజకవర్గానికి ఒకటి చొప్పున వాహనాలను ప్రభుత్వం చేకూర్చింది.తాజాగా ఈరోజు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శాసనమండలిలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ
పిల్లలకు వ్యాక్సిన్ల కోసం పలుమార్లు ఆస్పత్రికి వెళ్ళాల్సి ఉంటుంది.ఈ క్రమంలో తల్లిబిడ్డలను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రస్తుతం ఇప్పటికే రెండు వందల నలబై ఒకటి వాహనాలను సమకూర్చం.అవసరమైతే వాటి సంఖ్యా ఇంకా పెంచుతామని వివరించారు..
