కనిపిస్తే చెప్పు తెగేదాక కొట్టండి వాడిని..!! ఇటీవల కాలంలో తెలుగు సినీ ఇండస్ర్టీపై సంచలన వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్, అలాగే, ఓ టీవీ ఛానెల్‌పై సినీ నిర్మాత సీ.కల్యాణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అంతేకాకుండా యావత్ సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగింది. కాగా, ఇటీవల కాలంలో తెలుగు సినీ ఇండస్ర్టీకి, చంద్రబాబు సర్కార్ మధ్య వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా, టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ ఒక అడుగు ముందుకేసి తెలుగు సినిమా హీరోలు హీరోయిన్లతో రూముల్లో కులుతారని, ప్రజల సొమ్ముతో బతుకుతూ, ప్రజల సమస్యలపై పోరాడేందుకు బయటకు రారంటూ తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ చేసిన ఈ వ్యాఖ్యలపై తమ్మారెడ్డి భరద్వాజ, పోసాని కృష్ణ మురళీ ఘాటుగానే స్పందించారు.
see also : స్పీకర్ కోడెలకు కోలుకోలేని దెబ్బ..ఇద్దరు టీడీపీ నేతలు జగన్ సమక్షంలో వైసీపీలోకి..!
అయితే, మంగళవారం మా అసోసియేషన్ ఏర్పాటు చేసిన సమావేశంలో సినీ నిర్మాత సీ.కల్యాణ్ మాట్లాడుతూ.. సినీ ఇండస్ర్టీలో ప్రతీ ఒక్కరు తెలుగు ప్రజలకు ఉపయోగపడే వారే తప్ప.. ఏ ఒక్కరికీ అన్యాయం, ద్రోహం చేసేవారు కాదన్నారు. కొందరు వారి రాజకీయ లబ్ధి కోసం, మరికొందరు టీవీ రేటింగ్స్ కోసం సినీ నటులపై ***అలా వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. సినీ ఇండస్ర్టీలో ఉన్న ఆడపిల్లలంత గొప్ప వాళ్లు ఎవరైనా ఉన్నారా..? వారిలో ఉన్న సెంటిమెంట్స్ ఎవరిలో ఉండవు. వారిలో ఉన్న కమిట్‌మెంట్స్ ఎవరిలో ఉండవు అని పేర్కొన్నారు కల్యాణ్. ఇప్పటి వరకు జరిగింది చాలు. ఇకపై ఇలా చేస్తే ఏ రాజకీయ నాయకుడికైనా, అలాగే, ఏ టీవీ ఛానెల్‌కైనా భవిష్యత్ ఉండదంటూనే, సినీ చిత్ర సీమలోని మహిళలపై ఇకపై ఇలా ఎవరైనా ఇలాంటి పదజాలంలో విమర్శిస్తే చెప్పుతో కొడతామంటూ హెచ్చరించారు.