తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ ను ప్రపంచంలో అత్యుత్తమ నగరంగా అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు పలు కార్యక్రమాలను అమలు చేస్తూ విశ్వనగరంగా తీర్చి దిద్దుతున్న సంగతి తెల్సిందే.
ఈ క్రమంలో ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన మెట్రో సేవలను మరింత విస్తరించడానికి ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది.అందులో భాగంగా నగరంలో పలు మార్గాలను కల్పుతూ రెండో విడత మెట్రో నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తుంది.
అందుకు నగరంలో బీహెచ్‌ఈఎల్ నుంచి లక్డీకాపూల్ 62 కి.మీ, మైత్రీనగర్ నుంచి మియాపూర్ వరకు 26.2 కి.మీ, నాగోలు- ఎల్‌బీనగర్ మెట్రోస్టేషన్ల అనుసంధానం5.1 కి.మీ,రాయదుర్గం నుంచి శంషాబాద్: 30.7 కి.మీ.
లను మొత్తం 14,023 కోట్ల వ్యయంతో హైదరాబాద్ మెట్రో రైల్ తో పాటు హెచ్ఎండీఏ భాగస్వామ్యంతో ప్రభుత్వమే స్పెషల్ పర్పస్ వెహికిల్ ప్రాజెక్టుగా నిర్మించాలని నిర్ణయం తీసుకుంది .