గుడ్ ఫ్రైడే. యేసు క్రీస్తు శిలువ వేయబడ్డ రోజును గుర్తు చేసుకునే రోజు. క్రైస్తవులకు పవిత్రమైన రోజు. అయితే, ఈస్టర్ పండుగ ముందు వచ్చే శుక్రవారం రోజున గుడ్‌ఫ్రైడేను జరుపుకుంటారన్న విషయం తెలిసిందే. యేసు క్రీస్తు శిలువ వేయబడ్డ రోజు కాబట్టి గుడ్ ఫ్రైడేను బ్లాక్ ఫ్రైడే, గ్రేట్ ఫ్రైడే అని కూడా పిలుస్తారు. ఇదే రోజు క్రైస్తవులందరూ ప్రార్ధనా మందిరాలకు వెళ్లి.. యేసు క్రీస్తు యొక్క జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడమే కాకుండా, మరికొందరు కల్వరి సందర్శనార్ధం పయనమవుతుంటారు.
అయితే, గుడ్ ఫ్రైడే ముందు రోజు గురువారం రాత్రి దేవేడి యొక్క రాత్రి భోజనం చేసిన తరువాత నుంచి ఈస్టర్ గంట మ్రోగే వరకు బాప్టిజం తీసుకోవాల్సిన వారు, అలాగే, పాప పరిహారం కోసం ప్రార్ధనలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి స్వాంతన చేకూర్చడం కోసం ప్రార్ధన మందిరాల్లో ప్రార్ధనలు చేస్తారు. గురువారం రాత్రి నుంచే ఉపవాసం చేస్తూ యేసుక్రీస్తు సేవలో ఉండిపోతారు. పాపుల మార్పు కోసం రక్తం చిందించిన యేసు క్రీస్తును ప్రార్ధిస్తూ దీవెనలు పొందుతారు,