Home / POLITICS / అది రాయలసీమ అయినా.. పల్నాటి సీమ అయినా వైఎస్ జగన్ దిగనంతవరకే..!

అది రాయలసీమ అయినా.. పల్నాటి సీమ అయినా వైఎస్ జగన్ దిగనంతవరకే..!

గత 120 రోజులుగా ఆంద్రప్రదేశ్ అన్ని జిల్లాలోని నియోజక వర్గల్లో ప్రజలతో పల్లెల మీదుగా ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర సాగుతోంది. అశేశ జనాల మద్య విజయవంతంగా ముందుకు సాగుతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు కడప , క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, ప్ర‌కాశం జిల్లాల్లో పాద‌యాత్ర పూర్తికాగా ఈ నెల 12న
ప్రజాసంకల్పయాత్ర గుంటూరు జిల్లాలోని ప్ర‌వేశించింది. అయితే అది రాయలసీమ అయినా.. ప్రకాశం అయినా, నెల్లూరు అయినా.. జగన్ హాజరవుతున్నసభలకు ఇసుకేస్తే రాలనంత స్థాయిలో జనం వస్తున్నారు. మొట్టమొదటగా గత ఎడాది నవంబర్ నెలలో కడప జిల్లాలో.. జమ్మల మడుగులో జగన్ పాదయాత్రకు అశేశ జనం వస్తే.. అబ్బే అది కడప కాబట్టి వచ్చారన్నారు. అధికారంలో ఉన్న తెలుగు దేశం లోకల్ లీడర్లు మాట్లాడుతూ.. హీరోలు, హీరోయిన్లు వచ్చినా జనాలు వస్తారు.. అని ఎద్దేవా చేశారు.

అదే పక్కనే ఉన్నా అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం పరిధిలో బ్రహ్మాండమైన జనస్పందన వచ్చింది. అదే జిల్లా మరో నియోజక వర్డం కదిరిలో కను చూపు వరకు జనమే..ఇక చిత్తూరు జిల్లాలోనూ జగన్ వెళ్లిన చోటల్లా జనహారతులే కనిపించాయి.. అబ్బే, అదంతా రాయలసీమ అందుకే అలా వచ్చారు.. అని కొంతమంది తెలుగు తమ్ముళ్లు ఆనందపడ్డారు. కాని ఇప్పుడు రాయలసీమ దాటేశాడు, గ్రేటర్ రాయలసీమ దాటిపోయింది.. పల్నాడులోనూ జగన్ కు అంతకంటే ఎక్కువ స్థాయి జనాదరణే అని స్పష్టం అవుతోంది. నరసరావు పేట సభకు వచ్చిన జనాలను చూస్తే.. సాధారణ జనాలకు ఆశ్చర్యం, పచ్చ పార్టీ వాళ్లకు భయాందోళనలూ కలగకమానవు. ఎలా అంటారా..ఇసుక వేస్తే రాలని స్థాయిలో.. జగన్ సభల్లో కనిపిస్తున్న జనహోరును వర్ణించడానికి మాటలు రావు.. మరో మాటలో చెప్పాలంటే.. జగన్ పాదయాత్రగా వెళ్తేనే ఈ స్థాయిలో జనాలు అంటే.. బహిరంగ సభలు అంటే పరిస్థితి మరెలా ఉంటుందో.. ఇప్పటికే ఏపీలో ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ నేతల గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat