ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు అన్నట్లు ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి పరిస్థితి.ఇటు తెలంగాణ అటు ఏపీలో ఉన్న ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్స్ లో పద్నాలుగు ఛానల్స్ చంద్రబాబు కన్నుసైగలో నడుస్తాయి అని జగమెరిగిన సత్యం.చంద్రబాబు నందిని చూపించి పంది అంటే పంది అని ..పందిని చూపించి నంది అని చెబితే ప్రచారం చేస్తాయి ఆ మీడియా.అంతటి అనుకూలంగా మీడియా వలన చంద్రబాబు ప్రస్తుతం చిక్కుల్లో పడ్డారు.ప్రత్యేక హోదాపై కేంద్రంలో ,రాష్ట్రంలో మిత్రపక్షంగా బీజేపీ పార్టీతో టీడీపీ తెగదెంపులు చేసుకున్న సంగతి తెల్సిందే.
అయితే అందరు టీడీపీ రాష్ట్ర ప్రయోజనాల కోసమే బయటకు వచ్చిందని అందరు భావిస్తున్న తరుణంలో బాబు ఆస్థాన మీడియాకు చెందిన ఒక ఛానల్ వినూత్న కథనంతో బాబు గుట్టును బయటపెట్టాయి.ఆ కథనంలో గతంలో రాష్ట్ర విభజన ద్వారా కాంగ్రెస్ పార్టీ ఏపీలో పూర్తిగా కనుమరుగైనట్లు ప్రత్యేక హోదా ఇవ్వలేదని బీజేపీ పార్టీను ప్రజల్లో దోషిగా నిలబెట్టి ఆ పరిస్థితి తీసుకురావాలని చంద్రబాబు ఆలోచించారు అంట .అయితే అంతకుముందు బీజేపీ పార్టీ రానున్న ఎన్నికల్లో పది ఎంపీ సీట్లు ,యాబై అసెంబ్లీ స్థానాలను ఇవ్వాల్సిందిగా బాబును కోరింది బీజేపీ పార్టీ అధినాయకత్వం.
అయితే బాబుకు ఇది నచ్చలేదంట .అంతే ప్రత్యేక హోదాను సాకుగా చూపించి బీజేపీ పార్టీను ఏపీలో లేకుండా చేయాలనీ లక్ష్యంతో అటు కేంద్రంలో తమ పార్టీ ఎంపీలతో మంత్రి పదవులకు రాజీనామా చేయించాడు.అక్కడితో ఆగకుండా పోరాటాలు ..ఉద్యమాలు ..అవిశ్వాసం అంటూ ప్రజలను నమ్మించే పనిలో పడ్డారు అని ఆ మీడియా ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.అప్పటిదాకా రాష్ట్ర ప్రయోజనాల కోసమే టీడీపీ పార్టీ బయటకు వచ్చిందని ప్రజల్లో ప్రచారం చేసుకుంటున్న ఆ పార్టీ నేతలకు తమ ఆస్తాన మీడియా ఇలా కథనాన్ని ప్రచురించడంతో కంగు తిన్నారు అంట .వెంటనే చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా ఎవరు తీసుకున్న గోతిలో వారే పడినట్లు ఉందని తమ్ముళ్ళతో వాపోయారు అంట .ఇది అన్నమాట టీడీపీ బీజేపీ నుండి విడిపోవడానికి ఉన్న అసలు గుట్టు ..