Home / ANDHRAPRADESH / ఆంధ్రాకి ప్రత్యేక హోదా.. తెలంగాణ కి ప్రత్యేక ప్యాకేజీ !

ఆంధ్రాకి ప్రత్యేక హోదా.. తెలంగాణ కి ప్రత్యేక ప్యాకేజీ !

ప్రస్తుతం ఏపీలో రాష్ట్ర విభజన సమయంలో నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి కేంద్ర పాలక ప్రతిపక్ష పార్టీలు హామీ ఇచ్చిన సంగతి విదితమే.గత ఎన్నికల్లో కూడా ప్రత్యేక హోదా హామీ మీదనే ఇటు రాష్ట్రంలో టీడీపీ అటు కేంద్రంలో బీజేపీ నవ్యాంధ్ర ఎన్నికల బరిలోకి దిగాయి.తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హమీను తుంగలో తొక్కాయి.గత నాలుగు ఏండ్లుగా వైసీపీ చేస్తున్న పోరాటాల ఫలితంగా ప్రజల్లో చైతన్యం వచ్చి రోడ్లపైకి వచ్చి పోరాడటం మొదలెట్టారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే విద్యావంతుడు ,నెటిజన్ జగన్ రావు ఏపీకి ప్రత్యేక హోదా ..తెలంగాణకు ప్రత్యేక ఫ్యాకేజీ ఇస్తే ఎలా ఉంటుందని ఒక సగటు మనిషి ఏమి ఆలోచిస్తున్నాడో స్పష్టంగా ఒక పోస్టు పెట్టాడు .మీరు ఒక లుక్ వేయండి .ఉన్నది ఉన్నట్లు మీకోసం “2012-2013 లో ఆంధ్ర తో కలిసి ఉన్నప్పుడు తెలంగాణ గ్రోత్ రేట్ 2.2 %. విడిపోయిన నాలుగు సంవత్సరాల తర్వాత 2017 చివర్లో తెలంగాణ గ్రోత్ రేట్ ఎవరూ ఊహించని విధం గా KCR గారి నాయకత్వం లో 10.02 % కి పెరిగింది.

చంద్రబాబు గారి మాటల్లో ఆంధ్ర గ్రోత్ రేట్ 11.37% . భారతదేశ గ్రోత్ రేట్ 5.8 %. ఏ విధం గా చూసినా రెండు తెలుగు రాష్ట్రాలు సంఖ్యాపరం గా చూస్తే సంపన్నమైన రాష్ట్రాలు అనుకోవాలి.రాష్ట్రాల అధికారాలు, కేంద్ర అధికారాలు ఇంకా ఎవరి వాటా ఎంత, రాష్ట్ర GSDP (Gross State Domestic Product ) లాంటి వాటిని పరిగణలోకి తీసుకొని మాట్లాడితే ఏ టాపిక్ పరం గా అయినా ఏ ఇద్దరి వ్యక్తుల అభిప్రాయాలు ఒకేలా ఉండవు.సరే, సామాన్యుడి లా మాట్లాడుకుంటే తెలంగాణ సంపన్న రాష్ట్రం, ఆంధ్ర బీద రాష్ట్రం. మరియూ సగటు ఆంధ్రుడు సంపన్నుడు, సగటు తెలంగాణ వాడు బీద వాడు. ఎందుకు అంటే ఒక ఉదాహరణ: ఆంధ్ర లో ట్రాన్స్ పోర్ట్ సర్వీస్ లు అన్నీ ప్రయివేట్ వ్యక్తుల ఆధీనం లో ఉండి ప్రభుత్వ రాష్ట్ర రోడ్డు రవాణా వ్యవస్థ నష్టాల్లో ఉంది. ఆంధ్రా లో వ్యక్తులు చాలా ధనవంతులు అవుతున్నారు కానీ ప్రభుత్వానికి మాత్రం ఆదాయం రావటం లేదు. తెలంగాణ లో అత్యధిక శాతం ప్రభుత్వ ఆధీనం లో ఉండి లాభాల్లో ఉంది.

అనేది సగటు మనిషి ఆలోచన.కానీ, మళ్ళీ గణాంకాల్లోకి వస్తే 2017-2018 లో మన దేశ ఆదాయాన్ని దేశం లో ఉన్న పతి ఒక్కరికీ పంచితే 1,700 వందల అమెరికన్ డాలర్లు ($1,700 పర్ కాపిటల్ ). అయితే ఆంధ్ర ప్రదేశ్ లో ఇది $2,200 ఉంది. మనం అంతా బాగా అభివ్రుద్ది చెందిన రాష్ట్రాలు అనుకునే గుజరాత్ , మహారాష్ట్ర కంటే కూడా ఇది బాగా ఎక్కువ పర్ కాపిటల్ ఆదాయం.ఆంధ్ర ప్రదేశ్ కూడా సంపన్న రాష్ట్రమే. సహజ వనరులు కూడా చాలా ఉన్నై.వాస్తవ సమస్య రాజకీయ నాయకుల్లో ఉంది. మన దేశం లో 5 నుంచి 10 లక్షలు సంపాదించే వాళ్ళు 20% ట్యాక్స్ కట్టాలి. 10 లక్షలు దాటితే 30% ట్యాక్స్ కట్టాలి. దీనికి తోడు కేంద్ర GST, రాష్ట్ర GST. కానీ, రాంగ్ రూట్ లో వచ్చే వాహనాలని కూడా నిర్మూలించే సత్తా దేశం లో ఒక్క అధికారి కి అయినా ఉందా…? అన్నది ఆయా అధికారులే ఆలోచన చేయాలి. However, రాజకీయ నాయకులు ఎంత సమయం ప్రజల సమస్యలు నిర్మూలించటానికి కేటాయిస్తున్నారు..?

ఖర్చు పెట్టాల్సిన దానిలో ఎంత ఖర్చుపెడుతున్నారు అన్నది అందరికీ తెలిసిన విషయమే !మోదీ గారు ఏమీ చేయలేని నిస్సాహాయ స్థితి లో ఎందుకు ఉన్నారో, రాహూల్ గాంధీ లాంటి నాయకుడు ప్రతిపక్ష నాయకుడు ఎంటో..? ఎవరికీ అర్ధం కానీ పరిస్థితి.నిఖార్సైన జాతీయ నాయకుడే లేడు మన దేశం లో. ప్రపంచం లోని 195 దేశాల్లో 100 దేశాలకి పైగా ఎక్కువగానే మన దేశం లో ట్యాక్స్ లు ఉన్నై. నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఎక్కువే. ఒక సినెమా లో ఒక డైలాగ్ ఉంటుంది. 30 సంవత్సరాలు రౌడీ ఇజం చేసిన వాడెవడూ రౌడీ ఇజాన్ని కంటిన్యూచేయడు, రాజకీయం లోకి వస్తాడు అని. ఏయే రాజకీయ నాయకుడు ఏయే క్రిమినల్ పనులు చేశాడో పెరుమాళ్లకే ఎరుక !రూపాయి కూడా లంచం తీసుకొని, ఇవ్వని రాజకీయ నాయకులు, అధికారులు ఎంతమంది ఉంటారు మన దేశం లో అంటే సమాధానం ఏమిటి..?.

రాజకీయానికి కులం, బలమే అర్హతా ..?కేంద్రాన్ని వదిలి మళ్ళీ మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీలు అవసరం లేదు. ప్రత్యేక బాధ్యత తీసుకొని ప్రతి ఒక్క రాజకీయనాయకుడు, ప్రతి ఒక్క అధికారి పనిచేస్తే తెలంగాణ “బంగారు తెలంగాణ” అవుతుంది. ఆంధ్రా “స్వర్ణాధ్ర ప్రదేశ్” అవుతుంది.రెండు రాష్ట్రాల్లో చాలా సమస్యలు ఉన్నై, ప్రభుత్వాలు, అధికారులు వాటిని పరిష్కరించే దిశ గా ఆలోచన చేసి ముందుకు పోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అని సగటు మనిషి అభిప్రాయం.గ్రోత్ రేట్ ఎంత పెరిగింది..?, GDP ఎంత పెరిగింది..? GSDP ఎంత పెరిగింది..? పర్ క్యాపిటల్ ఎంత పెరిగింది ..? కాదు, గివన్నీ కాదు. “సామాన్యుడి క్యాలిటీ ఆఫ్ లైఫ్” ఎంత పెరిగింది అన్నది నాకు కావాలి. దేశం లో ఒక్కరైనా భరోసా ఇవ్వగలరా…?

-సగటు మనిషి
( వ్యక్తిగత అభిప్రాయం)

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat