సోషల్ మీడియా పోలింగ్‌లో తెలంగాణ బెస్ట్ ఎన్నారై ఎవరు..? అన్న కోణంలో జరిగిన ఈ సర్వేలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం ప్రాణాలకు తెగించి, విదేశాల్లో సైతం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వాణిని వినిపించేలా పోరాడిన వారికే నెటిజన్లు పట్టం కట్టారు. ఇంతకీ, ఈ సోషల్ మీడియా సర్వే ఏంటి..? ఎంత మంది ఈ పోలింగ్‌లో పాల్గొన్నారు..? ఎవరెవరు పోటీ పడ్డారు..? అన్న అంశాలను పరిశీలిస్తే.. వివరాలిలా ఉన్నాయి..బెస్ట్ ఎన్నారై ఆఫ్ తెలంగాణ – 2017 అన్న పేరుతో ఇటీవల కాలంలో ఓ సోషల్ మీడియా నెటిజన్ల నుంచి అభిప్రాయాలను సేకరించింది.
అంతేకాకుండా వారు పోలింగ్‌లో పాటిస్పేట్ చేసేలా ప్రోత్సహించింది. అయితే, ఈ పోలింగ్‌లో మొత్తం 20 మంది ఎన్నారైల మధ్య పోటీ చేయగా.. 14057 మంది నెటిజన్లు ఈ సర్వేలో పాల్గొన్నారు. ఈ సర్వేలో తెరాస ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల, తెరాస యూఎస్‌ఏ అడ్వైజరీ చైర్మన్ మహేష్ రావు తన్నీరులు ఇద్దరూ అగ్రస్థానంలో నిలిచారు. నాగేందర్‌కు 2651 ఓట్లు, అలాగే, మహేష్‌కు 1503 ఓట్లు లభించాయి.
విజేతలకు వచ్చిన ఓట్లు ,సోషల్ మీడియాలో ట్రేండింగ్..ర్యాండమ్ సర్వేలో మోస్ట్ పాపులర్‌గా మహేష్ రావు తన్నీరు అగ్రస్థానం లో నిలిచారు. ఆయన స్వయానా మంత్రి హరీష్ రావు సోదరుడు అంతేకాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మేనల్లుడు కావడం విశేషం.అగ్రస్థానంలో నిలిచిన వీరిద్దరూ కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో ముఖ్యులు కావడం గమనార్హం. ద్వితీయ స్థానంలో నాగేందర్‌రెడ్డి నిలిచారు.