ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు ,రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నాయుడు మరోసారి అసెంబ్లీ సమావేశాల సాక్షిగా తన సత్తా చాటారు.ఆయన ఈ రోజు సభలో ఎమ్మెల్సీ మూర్తి విశాఖ పట్టణంలో ఐటీ టవర్ల నిర్మాణం గురించి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు.
ఈ సందర్భంగా నారా లోకేష్ నాయుడు మాట్లాడుతూ “రాష్ట్రంలో ఐటీ రంగం అభివృద్ధికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుంది.యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా అహర్నిశలు కష్టపడుతూ తమ ప్రభుత్వం ముందుకు పోతుంది.2019లోపు రాష్ట్రంలో లక్షమందికి ఐటీ ఉద్యోగాలే కల్పనగా కృషి చేస్తున్నాం..
ప్రత్యేక పద్ధతుల ద్వారా ఐటీ కంపెనీలకు యాబై శాతం అద్దె ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు.అయితే గతంలో వైజాగ్ ఐటీ పరిశ్రమల స్థాపనకు అనుకూల ప్రాంతం కాదు .ఇక్కడ భూమే లేదు అని చెప్పిన చిన్నబాబు ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడటం స్క్రిప్ట్ తప్పుగా రాసారేమో అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు ..