తెలుగు సినీ నటి అపూర్వ మహిళా సంఘాలపై ప్రశ్నల వర్షం కురిపించింది. కాగా, ఇటీవల కాలంలో తెలుగు నటీ నటులకు సినీ ఇండస్ర్టీలో జరుగుతున్న అన్యాయంపై గాయత్రి గుప్తా, శ్రీరెడ్డి పెదవి విప్పిన విషయం తెలిసిందే. అంతేకాకుండా, శ్రీరెడ్డి ఒక అడుగు ముందుకేసి తెలుగు సినీ ఇండస్ర్టీలో పలువురు డైరెక్టర్లు, హీరోలు, ప్రొడ్యూసర్లు హీరోయిన్లపై, అలాగే తోటి నటీమణులపై చేస్తున్న లైంగిక దాడులపై పెదవి విప్పింది. అలాగే, తెలుగు సినీ ఇండస్ర్టీలో కమిట్‌మెంట్ లేనిదో నటులకు అవకాశం ఇవ్వరంటూనే బోల్డ్ వ్యాఖ్యలతో బహిరంగంగానే చెప్పంది శ్రీరెడ్డి.
అయితే, శ్రీరెడ్డి చేసిన ఆ వ్యాఖ్యలపై నటి అపూర్వ స్పందించింది. కాగా, కొంత మంది మగవాళ్లు మహిళల గురించి ఏమన్నా బోల్డ్‌గా మాట్లాడితే వ్యతిరేకించడమే కాకుండా, వారిపై కేసులుపెట్టే మహిళా సంఘాలు, అదే మహిళలు (శ్రీరెడ్డి) బోల్డ్‌గా మాట్లాడితే ఖండించరా..? అని విలేకరి ప్రశ్నకు అపూర్వ సమాధానమిస్తూ.. నిజమే శ్రీరెడ్డిలా బోల్డ్‌గా మాట్లాడినప్పుడు, అలా మాట్లాడకూడదమ్మా అని చెప్పాల్సిన బాధ్యత మహిళా సంఘాలపై ఉందని చెప్పింది.
అయితే, మహిళా సంఘాలు కొన్ని విషయాలను ఖండిస్తారు, మరికొన్నింటిని ఖండించరు అని, మంచి అయినా, చెడు అయినా వేగంగా ప్రజల్లోకి వెళ్లేది సినిమా నుంచే అని చెప్పింది అపూర్వ. సినిమాలో హీరో చెడిపోతే బయట పిల్లలు చెడిపోతారా..? సినిమాల్లో హీరోయిన్ ఏం చేస్తే అది బయట చేస్తారా..? అంటూ ప్రశ్నించింది. రామ్‌గోపాల్ వర్మ జీఎస్టీ గురించి మాట్లాడుతూ.. ఆ సినిమా మన కల్చర్‌కు దూరం కాబట్టి దాన్ని మహిళా సంఘాలు వ్యతిరేకించాయని చెప్పారు అపూర్వ. సోషల్ మీడియా వేదికగా శ్రీరెడ్డి బోల్డ్‌గా చేస్తున్న వ్యాఖ్యలను ఖండించాల్సిన బాద్యత మహిళా సంఘాలపై ఉందని చెప్పింది. అలా కాదమ్మా..? నీకు అన్యాయం జరుగుంటే దాన్ని సక్రమైన పద్ధతిలో ఎదుర్కో, కావాలంటే మేము కూడా నీ వెంట ఉంటాం అంటూ శ్రీరెడ్డికి సలహా ఇచ్చింది.