ప్రభుత్వాసుపత్రుల్లో రోగులు కిక్కిరిసి పడకలు చాలకపోతే కొన్నిసార్లు ఆసుపత్రి ప్రాంగణాల్లోనూ తాత్కాలికంగా వైద్యసేవలు అందిస్తుంటారు. అయితే, ఈ చిత్రంలోని బాధితులు చికిత్స పొందుతున్న మాత్రం ప్రభుత్వ ఆసుపత్రి ఎంత మాత్రం కాదు.. ప్రైవేటు వైద్యశాల అంటే నమ్మి తీరాల్సిందే. ప్రస్తుతం ఎండలు మండుతుండంతో ఆంద్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పరిధిలోని పలు గిరిజన తండాల్లోని చిన్నారులు సహా పెద్దలు అధిక సంఖ్యలో జ్వరంతో బాధపడుతున్నారు. యర్రగొండపాలెంలోని ప్రభుత్వాసుపత్రికి వెళితే సమయపాలన వలన చికిత్స అందడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో స్థానిక ప్రైవేట్ వైద్యశాలలను వారు ఆశ్రయిస్తున్నారు. జ్వరపీడితులు పోటెత్తుతుండటంతో అక్కడి వైద్యులూ ఇలా చెట్ల కిందనే మంచాలు వేసి సెలైన్ సీసాలను ఎక్కిస్తూ వైద్యసేవలు అందిస్తున్నారు. జ్వరంతో తిరిగి సొంతూళ్లకు వెళ్లలేక.. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈ తరహాలో చికిత్స చేయించుకోవాల్సి వస్తోందని రోగుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
