వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి, ఇప్పుడు దేశ రాజకీఆల్లో సంచలనంగా మారిన పేరు. నేడు అన్ని రాజకీయ పార్టీలను ఆకర్షిస్తున్న పేరు. ఏపికీ ప్రత్యేక హోదా విషయంలో.. ప్రత్యేక హోదాక ఢిల్లీలో, మంగళగిరిలో ప్రత్యేక పోరాటాలు చేస్తఆరు. ఇక తాజాగా ప్రత్యేక హోదా కోసం ప్రధాని మోడీతో ఢీకొట్టంఏదుకు రెడీ అయ్యారు. ముందుకు వస్తే. ఫలితంగా అక్రమ కేసులు నమోదయ్యాయి.
వైఎస్ జగన్, దేశ రాజకీయాల్లో ఈ పేరు ఓ సంచలనం. తాజా రాజకీయ పరిణామాల దృష్ట్యా వైఎస్ జగన్‌పై జాతీయ పార్టీలు దృష్టి సారించాయి. ఇప్పుడీ వార్తే సోసల్ మీడియాలో వైరల్‌గా మారింది. సోషల్ మీడియా కథనానికి కారణాలు కూడా లేకపోలేదు మరీ. ఓ సారి ఆ కారణాలను పరిశీలిస్తే.. నాడు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణ వార్తను తట్టుకోలేక మరణించిన అభిమానుల కుటుంబాలను ఆదుకునేందుకు జగన్ చేపట్టిన ఓదార్పు యాత్రను అడ్డుకునేందుకు నాటి అధికార పార్టీ కాంగ్రెస్ నేతలు చేయని ప్రయత్నాలంటూ లేవు.
చివరకు జగన్‌ను నేరుగా అడ్డుకోలేక, దొడ్డిదారిన జగన్‌పై కాంగ్రెస్ అక్రమ కేసులు బనాయించిందన్నది రాజకీయ విశ్లేషకుల మాట. ఈ విషయం జగమెరిగిన సత్యమే. అందులోను, ఈ విషయాన్ని స్వయాన కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ స్పష్టం చేశారు కూడాను. అయినా, వైఎస్ జగన్ జంకలేదు. నాడు, దేశంలోని రాష్ట్రాల్లో ఉన్న అధికార పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి భయపడుతున్న సందర్భంలో.. సోనియా గాంధీని ఎదిరించి మరీ కొత్త పార్టీ పెట్టారు వైఎస్ జగన్. అలా, నాడు సోనియా గాంధీని ధిక్కరించి రాజకీయ పార్టీ పెట్టి వైఎస్ జగన్ చరిత్రకెక్కారు.
నేడు, ప్రత్యేక హోదా విషయంలోనూ ప్రధాని మోడీపై ఎదురు దాడి చేసేందుకు వైఎస్ జగన్ వెనకడుగు వేయలేదు. 2014 ఎన్నికల్లో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ, ప్రత్యేక హోదా సాధిస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడు తిరుపతి వేంకన్న సాక్షిగా మాట ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, అధికారం చేపట్టాక వారు మాట మార్చారని, కానీ, వైఎస్ జగన్ మాత్రం ప్రత్యేక హోదాపై నాటి నుంచి నేటి వరకు ఒకే మాటపై నిలుస్తూ ప్రజలకు అండగా ఉన్నారన్నది సోషల్ మీడియా కథనం సారాశం.
ఏదేమైనా, ప్రధానిమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులను రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ ఎదిరించిన విధానం రాజకీయ చరిత్రలో లిఖించబడుతుందని, అందుకే దేశ రాజకీయ నాయకుల చూపును సైతం జగన్ తనవైపు తిప్పుకున్నారన్నది రాజకీయ విశ్లేషకుల మాట.